ఎక్కడుంది లోపం…’సర్’

నేను స్టూడెంట్ సర్..మరీ బ్యాడ్ మూవీ కాదు. మార్నింగ్ షో తోనే తీసి పక్కన పెట్టేసే సినిమా కాదు. ఓ సాదా సీదా థ్రిల్లర్ సినిమా. కథలో లోపాలు వుండొచ్చు. కథనంలో లోపాలు వుండొచ్చు.…

నేను స్టూడెంట్ సర్..మరీ బ్యాడ్ మూవీ కాదు. మార్నింగ్ షో తోనే తీసి పక్కన పెట్టేసే సినిమా కాదు. ఓ సాదా సీదా థ్రిల్లర్ సినిమా. కథలో లోపాలు వుండొచ్చు. కథనంలో లోపాలు వుండొచ్చు. కానీ బ్యానర్, పబ్లిసిటీ, ఇలాంటివి అన్నీ లెక్కలు, బేరీజు వేసి చూసుకుంటే కనీసం ఒక రోజు అన్నీ కాస్త కలెక్షన్లు కళ్ల చూడాలి. కానీ అలా జరగలేదు. మార్నింగ్ షో తోనే క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల సర్రున కిందకు జారిపోయింది. ఎందుకిలా?

వెనక్కు వెళ్తే ఇంతకన్నా పెద్ద బ్యానర్ లో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ గణేష్. ఆ సినిమా కాస్త వైవిధ్యమైన కథాంశం. మాంచి సపోర్టింగ్ స్టార్ కాస్ట్. నిర్మాణ విలువలు అన్నీ వున్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అందుకోలేకపోయింది. తొలిసినిమా. ఇంకా టైమ్ పడుతుంది అందుకోవడానికి అనుకున్నారు అంతా.

మలి సినిమా వచ్చింది. ఇప్పుడు మాత్రం హీరో ఇంకా ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. ఏ సీన్ అయినా లుక్స్ ఒకలాగే వుంటున్నాయి అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. అమాయకుడైన స్వాతిముత్యంగా, అమాయకుడైన స్టూడెంట్ గా ఆ లుక్స్ అలాగే వుంటాయి అని సరిపెట్టుకోవచ్చు. కానీ మరీ హుషారైన సీన్ లో కూడా లుక్స్ డల్ గా వుంటున్నాయన్న సంగతి హీరో గమనించాలి.

ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేసే సినిమాతో బెల్లంకొండ గణేష్ అన్ని విధాలా ప్రూవ్ చేసుకోవాల్సి వుంది. లేదూ అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది. అన్న బెల్లంకొండ శ్రీనివాస్ డ్యాన్స్ లు, ఫైట్లతో కొంత వరకు సక్సెస్ అయ్యారు. కానీ గణేష్ అలా కాదు. మెల్లగా స్టార్ట్ చేసి, మెల్లగా ఎదుగుదాము అంటే టాలీవుడ్ ఇప్పుడు అంత టైమ్ ఇవ్వడం లేదు.

సినిమాలు నిలబడవు, ఓపెనింగ్ రావడం కష్టం, నాన్ థియేటర్ మార్కెట్ లేదు…ఇలాంటి మాటలు హీరోల గురించి వినిపించకూడదు. వినిపిస్తే సినిమాలు రావడం కష్టం అయిపోతుంది. కథలు దగ్గరకు రావడం కష్టం అయిపోతుంది. అన్నీ ఫిల్టర్ అయిపోతాయి. అందువల్ల తక్షణం సరైన సినిమాను టేకప్ చేయడం, తనను ఆల్ రౌండర్ గా ప్రూవ్ చేసుకోవడం బెల్లంకొండ గణేష్ మీద తప్పనసరి బాధ్యతగా ఇప్పుడు మిగిలింది.