చంద్ర‌బాబుకి ప‌ది ప్ర‌శ్న‌లు

1. పేద‌వాళ్ల‌ని ధ‌నికులు చేస్తానంటున్న త‌మ‌రు 14 ఏళ్లు సీఎంగా వున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంద‌రిని ధ‌న‌వంతులుగా మార్చారు. 5 ఏళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ (విభ‌జ‌న‌)లో ఎంద‌రి జాతకాల‌ని మార్చారు? మీ వ‌ల్ల ఎవ‌రు కోటాను…

1. పేద‌వాళ్ల‌ని ధ‌నికులు చేస్తానంటున్న త‌మ‌రు 14 ఏళ్లు సీఎంగా వున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంద‌రిని ధ‌న‌వంతులుగా మార్చారు. 5 ఏళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ (విభ‌జ‌న‌)లో ఎంద‌రి జాతకాల‌ని మార్చారు? మీ వ‌ల్ల ఎవ‌రు కోటాను కోట్లు సంపాదించారో అంద‌రికీ తెలుసు. చిత్తూరులో సారా సిండికేట్ న‌డిపే సీఎం ర‌మేశ్ విమానం కొనేంత కుబేరుడ‌య్యాడు. సినీ న‌టుడు ముర‌ళిమోహ‌న్ హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ కింగ్‌గా మారాడు. ధ‌నికుల్ని కోటీశ్వ‌రుల్ని చేయ‌డ‌మే త‌మ ఎజెండా?

2. మాట‌కు ముందు మ‌నం పేద‌వాళ్లం అంటున్నారు. మీరు పేద‌వారే. అది 50 ఏళ్ల క్రితం. రెండెక‌రాల నుంచి ల‌క్ష కోట్లు సంపాదించారు. మీరు కూడా పేద‌వాళ్లే అయితే పేద‌రికం సిగ్గుప‌డదా?

3. ప్ర‌త్యేక హోదా కోసం స‌భ‌ల్లో క‌థ‌లు మాట్లాడుతున్నారు. బీజేపీతో పొత్తులో వున్న‌ప్పుడు నీళ్లు, మ‌ట్టి తీసుకుని నోరు మెద‌ప‌కుండా కూచున్నారు. ఆ ఐదేళ్లు మీ ఎంపీలు ఢిల్లీలో నిద్ర‌పోయారా?

4. జ‌గ‌న్ ప‌థ‌కాల గురించి విమ‌ర్శించే మీరు, మానిఫెస్టోలో పెట్టిన ప‌థ‌కాలు ఎలా అమ‌లు చేస్తారో వివ‌రించ‌గ‌ల‌రా? ప్ర‌జ‌లు అమాయ‌కులు నిజ‌మే. కానీ ప‌దేప‌దే మోస‌పోతార‌నుకోవ‌డం మీ అమాయ‌క‌త్వ‌మే.

5. ఎన్టీఆర్ త‌న ప్ర‌తి సినిమాలో మారువేషం వేసేవారు. ఆయ‌న నుంచి మీరు ఏమి నేర్చుకోక‌పోయినా మారువేషాలు మాత్రం నేర్చుకున్నారు. ఆయ‌న తెర మీద న‌టిస్తే , మీరు రాజ‌కీయాల్లో న‌టిస్తారు. రోజుకో మారువేషంతో వ‌స్తారు.

6. ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారంతో వ్యాపారం చేసిందెవ‌రు? అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ ఎవ‌రిది? హైటెక్ సిటీలో ఆడిన గేమ్ మ‌ళ్లీ ఆడిందెవ‌రు? పేద‌ల‌కు స్థలం పంచితే ఎద్దేవా చేసిందెవ‌రు? పేద‌ల‌కు సెంట్ స్థ‌ల‌మే విలువైంది. మీలా క‌ర‌క‌ట్ట మీద బంగ‌ళాలో వాళ్లు వుండ‌లేరు క‌దా?

7. సంప‌ద పెంచుతామంటున్నారు. ఎవ‌రి సంప‌ద‌?

8. తెలంగాణాతో పోలిస్తే మ‌న‌మెక్క‌డ అంటున్నారు. ఓటుకు నోటు కేసులో బ్రీఫ్‌డ్ మీ అని ఇరుక్కుని హైద‌రాబాద్ మీద ప‌దేళ్ల హక్కులు వ‌దులుకుని పారిపోయి వ‌చ్చిందెవ‌రు?

9. వెనుక‌టికో పులి మాంసం తిన‌డం మానేస్తాన‌ని అనింద‌ట‌. అవినీతి మీ స‌హ‌జ ఆహారం. మీరు అవినీతిని నిర్మూలిస్తామంటే ఎవ‌రైనా న‌మ్ముతారా?

10. ప్ర‌ధానుల్ని, రాష్ట్ర‌ప‌తుల్ని మార్చేసే చ‌రిత్ర వున్న మీరు, ఎన్టీఆర్‌కి భార‌త‌ర‌త్న ఎందుకు తీసుకురాలేదు? ఆధునిక క‌ట్ట‌ప్ప‌గా ఎన్టీఆర్‌ని పొడిచిన త‌మ‌రు, ఆయ‌న శ‌త జ‌యంతి ఉత్స‌వాలు జ‌రుపుతున్నారు. బాహుబ‌లి ఒక సినిమా. మిమ్మ‌ల్ని న‌మ్మితే రాష్ట్ర ప్ర‌జ‌లకి కోమా.