Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఓ పెద్ద బేరం..సమావేశ సారం..ఇదేనా?

ఓ పెద్ద బేరం..సమావేశ సారం..ఇదేనా?

ఆంధ్రలో ఏం జరుగుతోంది. ఢిల్లీలో ఏం జరుగుతోంది? రకరకాల సమావేశాలు..తెలిసి కొన్నీ..తెలియక కొన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ 2024లో జరిగే ఆంధ్ర ఎన్నికల నేపథ్యంలోనా..2023లో జరిగే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనా..రెండూ కాదు..తెలంగాణలో కవిత..ఆంధ్రలో అవినాష్ రెడ్డి కేసుల నేపథ్యంలోనా..ఎవరి ఊహాగానాలు వారివి. ఎవరి ఆశలు వారివి. 

అమిత్ షా తో చంద్రబాబు సమావేశం జరిగింది. నిజానికి ఇది చాలా పెద్ద పరిణామం. తెలుగుదేశం అనుకూల పత్రికలు దీన్ని చాలా భారీ ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది. సోషల్ మీడియా లో అస్సలు హడావుడి లేదు. ఎందుకు?

కోరమాండల్ రైలు ప్రమాదం వార్త హైలైట్ చేయాల్సి వచ్చింది కనుక ఈ వార్త చిన్నదైపోయిందా? అలా అనుకొవడానికి లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి నాట్ నాట్ వన్ పర్సంట్ పనికి వస్తుందన్న వార్త ను ఏ రేంజ్ లో లేపుతారు ఈ మీడియాలు అన్నీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా అదిగో మీటింగ్ అంటే ఇదిగో పొత్తు అంటూ గతంలో ఎన్నో వార్తలు వండి వార్చారు. అలాంటిది ఇప్పుడు ఇదేదో ఫార్మల్ మీటింగ్. పొత్తుల గురించి చర్చ రాలేదు. జస్ట్ పరిస్థితులు మాట్లాడుకున్నారు. అని మాత్రం సింపుల్ గా రాసి వదిలేసుకున్నారు అంటే..సమ్ థింగ్..సమ్ థింగ్..అని అనుకోవాల్సిందే.

జగన్ ఢిల్లీ వెళ్లినపుడల్లా కేసులు, అరెస్ట్ ల కోసం వెళ్లారు అనే ఫీడింగ్ లు వినిపించేవి. ఇప్పుడు చంద్రబాబు వెళ్లినా అదే తరహా ఫీడింగ్ వినిపిస్తోంది. ఆంధ్రలో త్వరలో జరుగుతుంది అని వినిపిస్తున్న ఓ పెద్ద తలకాయ అరెస్ట్ వార్తల నేపథ్యంలో చంద్రబాబు వెళ్లారనే గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమయ్యాయి. ఇవి వైకాపా జనాల కుట్ర అని కొట్టిపారేయచ్చు. అందులో నిజం వుండొచ్చు. లేకపోవచ్చు.

ఆంధ్రలో జరుగుతున్న ఓ ‘టగ్ ఆఫ్ వార్’ నేపథ్యంలో రాజీ ప్రతిపాదన మీదనే చంద్రబాబు వెళ్లారని మరో గ్యాసిప్ వినిపిస్తోంది. అయితే దానికి అటునుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్నది తెలియదు. కానీ దాని మీద కూడా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 

రాజీ ప్రతిపాదన ఇటు నుంచి వెళ్తే, ‘వాటా కొనుగోలు’ వచ్చిందని వదంతులు వినిపిస్తున్నాయి. సగం వాటా అమ్మేస్తే, కొనుగోలు చేసి గట్టెక్కించేస్తామనే ప్రతిపాదన ఢిల్లీ వర్గాల్లో వచ్చిందని, ఆ బేరం సాధ్యం కాదు కనుకే ఈ రాయబారం నడుపుతున్నారని టాక్. అమిత్ షా అపాయింట్ మెంట్ బాబుగారి వైపు నుంచి ఖరారు కాలేదని ‘వేరేవాళ్లు’ ఫిక్స్ చేసి ఆయనను రాయబారానికి పంపారని టాక్.

మొత్తం మీద దేశంలో ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారాలు వేరు వేరుగా లేవు. అన్నీ కలసి జమిలిగా పెనవేసుకుని నడుస్తున్నాయి. తెలంగాణ-ఆంధ్ర వ్యాపార వేత్తలు కలిసి చేసిన లిక్కర్ డీల్ దేశం మొత్తం మీద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వాన్నే ఇరుకున పెడుతోంది. 

ఆదానీ వ్యవహారాలు అండగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఆంధ్రలో జగన్ చెపుతున్నదీ అదే. తనకు డబ్బున్న బడాబాబులకు మధ్యే అంటున్నారు. ఆంధ్రలో ఓ వర్గం వ్యాపారాలను జగన్ అణిచేస్తున్నారనే విమర్శలు వున్నాయి.

దేశంలోని విమానాశ్రయాలు, పోర్టులు, మీడియాను ఒక కంపెనీ బలవంతంగా తన చేతుల్లోకి తీసుకుంటోందనే వార్తలు వున్నాయి. ఇప్పుడు ఆంధ్రలో ఓ బడా సంస్థకు సంబంధించి కూడా బేరాలు దాని మీదే రాయ బారాలు సాగుతున్నాయి అంటుంటే..ఇక రాజకీయాలు వేరు వ్యాపారాలు వేరు అని అనుకోవడానికి లేదు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా