ఆదిపురుష్ కు ఓవర్సీస్ లో అడ్డంకులు?

ఓవైపు ఆదిపురుష్ పై భారీగా బెట్టింగ్ సాగుతోంది. ఈసారి ప్రభాస్ వెయ్యి కోట్ల గ్రాస్ కొడతాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే ఈ ఘనత సాధించాలంటే ఆదిపురుష్ సినిమా ఓవర్సీస్ లో గట్టిగా ఆడాలి. సరిగ్గా…

ఓవైపు ఆదిపురుష్ పై భారీగా బెట్టింగ్ సాగుతోంది. ఈసారి ప్రభాస్ వెయ్యి కోట్ల గ్రాస్ కొడతాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే ఈ ఘనత సాధించాలంటే ఆదిపురుష్ సినిమా ఓవర్సీస్ లో గట్టిగా ఆడాలి. సరిగ్గా ఇక్కడే ప్రభాస్ సినిమాకు స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. ఆదిపురుష్ రిలీజ్ టైమ్ లో హాలీవుడ్ లో సందడి కాస్త ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా ఐమ్యాక్స్, ఎక్స్ డీ స్క్రీన్స్ కు డిమాండ్ ఉంది.

ఇలాంటి టైమ్ లో ఓవర్సీస్ లో ఆదిపురుష్ సినిమాకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ పెద్ద సినిమాకు ఓవర్సీస్ లో ఎప్పుడూ భారీ స్క్రీన్స్ అందుబాటులో ఉంటాయి. కాకపోతే హాలీవుడ్ సినిమాలతో క్లాష్ కాకుండా మన సినిమాల విడుదల ప్లాన్ చేసుకుంటారు. అయితే ఆదిపురుష్ కు మాత్రం ఆ వెసులుబాటు దక్కలేదు.

మరోవైపు దేశీయంగా కూడా ఆదిపురుష్ కు హాలీవుడ్ సెగ తగలొచ్చని అభిప్రాయపడుతోంది ట్రేడ్. ప్రభాస్ నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఇండియాలో నిస్సందేహంగా అత్యథిక సంఖ్యలో స్క్రీన్స్ దొరుకుతాయి. అయితే అదే టైమ్ లో ది ఫ్లాష్ అనే సినిమాకు కూడా ఇండియాలో మంచి క్రేజ్ ఉంది.

ఆ క్రేజ్ కు తగ్గట్టే ఫ్లాష్ మూవీకి ఇండియన్ మల్టీప్లెక్స్ చెయిన్స్ నుంచి మద్దతు దక్కుతోంది. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. పైగా ఈసారి ఫ్లాష్ లో బ్యాట్ మాన్ ఎంట్రీ కూడా ఉండడంతో, హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకుల్లో క్రేజ్ ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్టు ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

అలా ఓవర్సీస్ తో పాటు, డొమస్టిక్ గా కూడా ఆదిపురుష్ సినిమాకు కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇదంతా మొదటి రోజు వరకు మాత్రమే. మౌత్ టాక్ ఫుల్ పాజిటివ్ గా వస్తే, అన్నీ కొట్టుకుపోతాయి. ఆదిపురుషుడు మాత్రమే నిలబడతాడు. ఇది ఫిక్స్.