విశాఖలో భూ కబ్జాలు…సిట్ నివేదికల్లో సీక్రెట్

విశాఖ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ ప్రాంతం మీద ఎపుడూ మక్కువ చూపించే వారు ఉన్నారు. విశాఖ రాజకీయంగా కూడా చాలా మందికి టూరిస్ట్ స్పాట్ అయింది. అక్కడ సొంత వ్యాపకాలు వ్యాపారాల…

విశాఖ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ ప్రాంతం మీద ఎపుడూ మక్కువ చూపించే వారు ఉన్నారు. విశాఖ రాజకీయంగా కూడా చాలా మందికి టూరిస్ట్ స్పాట్ అయింది. అక్కడ సొంత వ్యాపకాలు వ్యాపారాల మీద వచ్చిన వారు అక్కడే ఎదిగి రాజకీయంగా పదవులు సంపాదించుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఉమ్మడి ఏపీ విభజన తరువాత విశాఖ మీద ఫోకస్ మరింతగా పెరిగింది. దాంతో విశాఖలో భూములకు రెక్కలు వచ్చేశాయి. చాలా మంది విశాఖ భూములను చాప చుట్టేశారు. అలా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విపక్షాలు అన్నీ ఆందోళన చేసిన మీదట 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ని నియమించింది. ఆ సిట్ 2018లో భారీ నివేదికను ఆనాటి ప్రభుత్వానికి ఇచ్చింది.

అయితే అందులో ఏముందో ఈ రోజుకీ సీక్రెట్ గానే ఉంది. ఆ నివేదికను బహిర్తం చేయలేదు కాబట్టి భూ కబ్జాల భాగోతం రహస్యంగా ఉండిపోయినిది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిట్ ని విశాఖ భూ కబ్జాల మీద ఏర్పాటు చేసింది. ఆ సిట్ నివేదికను 2021లో సమర్పించింది. ఆ నివేదికలో ఏముందో తెలియదు.

ఈ నేపధ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రెండు సిట్ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో గడచిన కాలంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని, భూ ఆక్రమదారులు అంతా ఇప్పటికీ సేఫ్ గా ఉన్నారని అంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కీలక నేతల మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం నాయకులు తమ మీద వచ్చిన ఆరోపణలు మరచి వైసీపీ భూములను దోచేసింది అని ఆరోపణలు చేయడం మొదలెట్టారు. ఇపుడు రెండు సిట్ నివేదికలను బీజేపీ ఎంపీ కోరుతున్నారు. దాంతో టీడీపీకి ఇరకాటంగా మారుతోంది. విశాఖ సిటీ పరిధిలో ఆనాడు జరిగిన భూ కబ్జాలు సంచలనం రేపాయని కూడా అంటున్నారు. సిట్ నివేదికలు బయటకు వస్తే విశాఖ రాజకీయాల్లో పెను సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు.