ఉత్తరప్రదేశ్ లో ‘కేరళ స్టోరీ’

ది కేరళ స్టోరీ సినిమా ఉత్తర ప్రదేశ్ లో రిపీట్ అయింది. ఓ మహిళను మోసం చేసి, బలవంతంగా ఆమెతో మతమార్పిడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మహిళ…

ది కేరళ స్టోరీ సినిమా ఉత్తర ప్రదేశ్ లో రిపీట్ అయింది. ఓ మహిళను మోసం చేసి, బలవంతంగా ఆమెతో మతమార్పిడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మహిళ చెప్పిన వివరాలు వింటే ఎవరైనా షాక్ అవుతారు.

బరేలీకి చెందిన అబిద్ అనే యువకుడు, అంకిత్ గా పేరు మార్చుకొని, 24 ఏళ్ల అమ్మాయికి దగ్గరయ్యాడు. ముందు ఫ్రెండ్ షిప్ అన్నాడు, ఆ తర్వాత ప్రేమ అన్నారు. ఆ తర్వాత శారీరకంగా దగ్గరయ్యాడు. అదే టైమ్ లో ఆమె ప్రైవేట్ వీడియోస్ తీసుకున్నాడు.

ఇక అక్కడ్నుంచి తన అసలు రూపం బయటపెట్టాడు అబిద్. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ప్రైవేట్ వీడియోలు రిలీజ్ చేస్తానని బెదిరించాడు. దీంతో యువతి సరే అంది. అయితే పెళ్లి కంటే ముందు మతమార్పిడి చేసుకోవాలని కండిషన్ పెట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మతం మారింది.

అక్కడితో అబిద్ అరాచకాలు ఆగలేదు. ఆమెతో మాంసం తినిపించాడు. ఆ తర్వాత ఏకంగా తన తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని అన్నాడు. యువతిని గదిలో బంధించి హింసించాడు. దీంతో ఆ యువతి ఎలాగోలా తప్పించుకొని పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

సరిగ్గా ఇలాంటిదే మరో ఘటన బరేలీ రూరల్ లో జరిగింది. ఆలీమ్ అనే వ్యక్తి ఆనంద్ గా పేరు మార్చుకొని, యువతిని లోబరుచుకున్నాడు. ఆమెను ఆలయంలో వివాహం చేసుకొని, గర్భవతిని కూడా చేశాడు. ఆ తర్వాత అబార్షన్ చేసుకోమని బలవంతం చేశాడు. దీనిపై కూడా పోలీస్ కేసు నమోదైంది.