పాపం.. చంద్రబాబును ఎవరికైనా చూపించండ్రా..!

‘‘తెలుగుదేశం పార్టీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు’’ Advertisement ‘‘రెండువేల రూపాయల నోట్లను రద్దుచేసి అవినీతిని నిర్మూలించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.’’ ‘‘అందుకే మాకు ఆలోచనలు వస్తాయ్’’ ఇలాంటి మాటలను చంద్రబాబునాయుడు నోటినుంచి వింటే ఎవ్వరికైనా…

‘‘తెలుగుదేశం పార్టీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు’’

‘‘రెండువేల రూపాయల నోట్లను రద్దుచేసి అవినీతిని నిర్మూలించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.’’

‘‘అందుకే మాకు ఆలోచనలు వస్తాయ్’’

ఇలాంటి మాటలను చంద్రబాబునాయుడు నోటినుంచి వింటే ఎవ్వరికైనా సరే ఏం అనిపిస్తుంది. ‘బాబు గార్ని పాపం.. ఎవరికైనా చూపించండ్రా..’ అనాలనిపిస్తుందా? లేదా? వయసు పైబడి ఆయనకు బుర్ర తిరుగుతోందని, బుద్ధి వికంటించిందని జాలి కలుగుతుందా లేదా?

తొమ్మిది పథకాలతో తొలి మేనిఫెస్టోను ప్రకటించి.. నవరత్నాల ఐడియాను కాపీ కొట్టిన వ్యక్తి చంద్రబాబునాయుడు. తాను సెంటిమెంటల్ గా తొమ్మిదిని ఎంచుకున్నట్టుగా కనిపించకుండా ఉండడానికి ఒకే మహాశక్తి కేటగిరీ కింద నాలుగు పథకాలను దాచిన వ్యక్తి ఆయన. 

ఆ తొమ్మిది పథకాలలో ‘పూర్ టూ రిచ్’ అనే ఒకే ఒక్క పథకం తప్ప.. మరే ఇతర సొంత ఆలోచన లేకుండా అచ్చంగా ప్రతిదీ కాపీ క్యాట్ లాగా ఇతర రాష్ట్రాలనుంచి కాపీ కొట్టి, జగన్ పథకాలనుంచి కాపీ కొట్టి తన మేనిఫెస్టోను తయారుచేసుకున్న వ్యక్తి ఆయన! అలాంటి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరుగా అభివర్ణిస్తూ ఉంటే ఎవ్వరికైనా సరే.. ఆయనను ఎవరికైనా చూపించాలని అనిపిస్తుందా? లేదా? పడీపడీ నవ్వాలనిపిస్తుందా లేదా?

మేనిఫెస్టో తనకు ఓట్లు దండిపెడుతుందని ఎదురుచూస్తున్న చంద్రబాబు.. తాను ప్రకటించిన పథకాలన్నీ కాపీ పథకాలు అంటూ వెల్లువెత్తున్న విమర్శలను, గేలి నవ్వులను తట్టుకోలేకపోతున్నారు. ఆ ఉక్రోషంలో ఏదేదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చదువుల గురించి కూడా ఎగతాళి చేస్తున్నారు.

పథకాలన్నింటినీ కాపీ కొట్టి చంద్రబాబు పులిహోర కలిపాడని, కర్ణాటక పథకాలు తీసుకొచ్చి బిసిబేళీ బాత్ చేశాడని జగన్ విమర్శిస్తే.. చంద్రబాబు వాటిని కూడా మురిసిపోతూ మళ్లీ తానే ప్రస్తావిస్తున్నారు. టేస్టీగా ఉంటూ పౌష్టికాహారం తక్కువగా ఉండేది పులిహోరట. అత్యద్భుత పౌష్టికాహారం బిసిబేళీ బాత్ అట! అంటే ఈ రెండింటితో పోల్చడం ద్వారా తాను అన్నింటికంటె బెస్ట్ ఇచ్చినట్టుగా జగన్ యాక్సెప్ట్ చేశారట. 

జగన్ ప్రసంగం ఎవరు రాసిచ్చారో ఆయనకు తెలియదు గానీ.. వాళ్లు జగన్ తో అలా తెదేపాను పొగిడించారని అర్థమైతే వారిని కూడా లేపేస్తారట.. తన మీద హేళనలకు ఇలాంటి భాష్యాలు చెప్పుకుంటూ చంద్రబాబు రోజు గడిపేస్తున్నారు.