దుష్యంతుడు కావలెను

దర్శకుడు గుణశేఖర్ కు శకుంతల దొరికేసింది. సమంత ఆ క్యారెక్టర్ ను చేయడానికి ఓకె అనేసింది. అంతవరకు బాగానే వుంది. కానీ అసలు సమస్య ఇక్కడే వుంది.  Advertisement సమంతకు సరిపడా దుష్యంతుడు ఎవరు?…

దర్శకుడు గుణశేఖర్ కు శకుంతల దొరికేసింది. సమంత ఆ క్యారెక్టర్ ను చేయడానికి ఓకె అనేసింది. అంతవరకు బాగానే వుంది. కానీ అసలు సమస్య ఇక్కడే వుంది. 

సమంతకు సరిపడా దుష్యంతుడు ఎవరు? ఇప్పుడు అదే వెదుకులాట సాగుతోంది. రానాను అడిగారు. నో అన్నాడు. మరో ఒకరిద్దరని అనుకున్నారు కానీ సూట్ కాదన వదిలేసారు. ఇప్పడు కన్నడ, మలయాళ హీరోల వైపు చూస్తున్నారు. 

నిజానికి శకుంతల ఎంత కీలకమైన పాత్రో, దుష్యంతుడు కూడా అంతటి కీలకమైన పాత్ర. శంకుతల ప్రేమించింది, అతనితో కలిసి బిడ్డను కన్నది. అతన్ని కలవాలని తపన పడింది. ఇన్ని జరగాలంటే దుష్యంతుడు కూడా బలమైన హీరో అయి వుండాలి.

అందుకే వెదుకులాట సాగుతోంది. తెలుగు హీరోలు ఎవ్వరూ నప్పరనో? ఒప్పుకోరనో? పరభాషా హీరోల వైపు చూస్తున్నారు దర్శకుడు గుణశేఖర్ అని తెలుస్తోంది. కానీ పౌరాణిక పాత్రలు వేయాలంటే మన హీరోల తరువాతే కదా?  

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి