పవన్ కు హ్యాండ్ ఇచ్చిన రకుల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాటకు డ్యాన్స్ చేయడం అంటే ఆల్ మోస్ట్ ఆల్ హీరోయిన్స్ రెడీగా వుంటారు. అందులో సందేహం లేదు. కాస్త చాన్స్ లు తగ్గిపోయిన హీరోయిన్లు అయితే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాటకు డ్యాన్స్ చేయడం అంటే ఆల్ మోస్ట్ ఆల్ హీరోయిన్స్ రెడీగా వుంటారు. అందులో సందేహం లేదు. కాస్త చాన్స్ లు తగ్గిపోయిన హీరోయిన్లు అయితే ఎగిరిగంతేస్తారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం..చేస్తానని చెప్పి..లాస్ట్ మినిట్ లో డేట్ లు అవైలబుల్ లేవని చెప్పేసి షాక్ ఇచ్చేసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ తో సముద్రఖని డైరక్షన్ లో ‘బ్రో’ అనే సినిమా తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. జస్ట్ రెండు పాటలు ఫినిష్ చేస్తే చాలు. వాటిల్లో ఒకటి స్పెషల్ సాంగ్. ఇద్దరు హీరోల మీద చిత్రీకరిస్తారు. ఈ పాటలో నర్తించేందుకు ఎవర్ని తీసుకోవాలా అని చాలా పేర్లు పరిశీలించారు. తమన్నా, శృతిహాసన్ ఇలా చాలా పేర్లు పరిశీలించారు.

ఆఖరికి రకుల్ ప్రీత్ సింగ్ ను ఫైనల్ చేసారు. తెలుగు సినిమాలకు రకుల్ ఎందుకో చాలా కాలంగా దూరంగా వుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం ఓకె చెప్పింది. ఈ సోమవారం షూట్ వుంది. కానీ శుక్రవారం సమాచారం అందింది. తనకు డేట్ లు అడ్జస్ట్ కావడం లేదని. దీంతో యూనిట్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

రకుల్ ఎప్పుడు వస్తుందో కనుక్కుని ఆ డేట్ లకు పవన్ కళ్యాణ్ డేట్ లు మళ్లీ అడగడమా? లేకపోతే మరో హీరోయిన్ ను ఎవరినన్నా సెట్ చేయడమా అన్నది ఇప్పుడు చర్చల్లో వుంది. ఎవరూ లేకపోతే ఊర్వశి రౌతాలా వుందిగా. మన హిట్ సినిమా స్పెషల్ సాంగ్ లకు ఆమె రెడీ కదా.