హీరో కి..మేనేజర్ కు వివాదం!

ఎక్కడా చిరకాల మితృత్వం…శతృత్వం వుండదు. అందులోనూ రాజకీయాల్లో..సినిమాల్లో అస్సలు వుండవు. అవసరాలు వుంటాయి తప్ప అభిమానాలు వుండనే వుండవు. ఇదే మరోసారి ప్రూవ్ అయింది. హీరో సాయి ధరమ్ తేజ్-అతని మేనేజర్ సతీష్ విషయంలో.…

ఎక్కడా చిరకాల మితృత్వం…శతృత్వం వుండదు. అందులోనూ రాజకీయాల్లో..సినిమాల్లో అస్సలు వుండవు. అవసరాలు వుంటాయి తప్ప అభిమానాలు వుండనే వుండవు. ఇదే మరోసారి ప్రూవ్ అయింది. హీరో సాయి ధరమ్ తేజ్-అతని మేనేజర్ సతీష్ విషయంలో. ఇద్దరూ అపూర్వ స్నేహితుల లెక్క. అస్సలు మేనేజర్ – హీరో మాదిరిగా కాదు. అలాంటి వాళ్లు ఇద్దరూ గట్టిగా మాటా మాటా అనుకున్నారు. గట్టిగా అరుచుకున్నారు. వాదించుకున్నారు. ఇదంతా కేరవాన్ లో జరిగినట్లు తెలుస్తోంది.

ఇదంతా ‘బ్రో’ సెట్ లోనే. ఎందుకు..ఎమిటి..అయితే తెలియదు..మొత్తానికి ఈ రోజు షూటింగ్ స్పాట్ లో గడబిడ జరిగింది. అరుచుకున్నారు. విడిపోయారు.

సతీష్ మెగా ఫ్యాన్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సాయి ధరమ్ తేజ్ కు చాలా సన్నిహితుడు. అందుకే ఉద్యోగం మానిపించి, తన దగ్గరే వుంచుకున్నాడు. సతీష్ కూడా చాలా విశ్వాసంగా, అభిమానంగా వుంటున్నారు. ముఖ్యంగా తేజ్ కు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి నిత్యం అంటిపెట్టుకునే వుంటూ వచ్చారు. సినిమాల ప్లానింగ్, పబ్లిసిటీ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. విరూపాక్ష వైజాగ్ ఏరియా తనే పంపిణీ చేసారు.

తేజు-సతీష్ ఇద్దరూ కలిసి ఎక్కడ కనిపించినా ఓ హీరో మేనేజర్ ల మాదిరిగా కాకుండా స్నేహితుల మాదిరిగా వుండేవారు. అలాంటిది వాళ్లిద్దరి నడుమ గొడవ జరిగింది అంటే ఇండస్ట్రీ జనాలు నమ్మలేకపోతున్నారు.