టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, పెళ్లికొడుకయ్యాడు. అతడి పెళ్లి వేడుక కొద్దిసేపటి కిందట జైపూర్ లో అంగరంగ వైభవంగా మొదలైంది. పెళ్లికోసం జైపూర్ లోని లీలా ప్యాలెస్ ను అద్భుతంగా డెకరేట్ చేశారు.
2 రోజుల పాటు అట్టహాసంగా జరగనుంది శర్వానంద్ పెళ్లి వేడుక. ఈ పెళ్లికి సినీ స్టార్స్ తో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. స్వయంగా శర్వానంద్ వెళ్లిమరీ, శుభలేఖలిచ్చి కొంతమందిని తన పెళ్లికి ఆహ్వానించాడు.
మరికొద్దిసేపట్లో మెహందీ ఫంక్షన్ మొదలవుతుంది. సాయంత్రం సంగీత్ ఉంటుంది. రేపు అసలైన పెళ్లి వేడుక ఉంటుంది. వివాహ వేడుక రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమౌతుంది.
శర్వానంద్, రక్షిత ఎంగేజ్ మెంట్ జనవరిలో జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబసభ్యులతో పాటు రామ్ చరణ్ లాంటి పలువురు ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.
ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్, ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది. పెళ్లి కోసం ఈ సినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చాడు శర్వానంద్.