బెల్లంకొండ…గుంటూరు నాయకుడు

తనపై, తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక ఓ రాజకీయ నాయకుడు వున్నారని చెప్పి, నిర్మాత బెల్లంకొండ సురేష్ కొత్త సంచలనానికి తెరతీసారు. ఆ నాయకుడు ఎవరో తరువాత బయట పెడతా అన్నారు…

తనపై, తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక ఓ రాజకీయ నాయకుడు వున్నారని చెప్పి, నిర్మాత బెల్లంకొండ సురేష్ కొత్త సంచలనానికి తెరతీసారు. ఆ నాయకుడు ఎవరో తరువాత బయట పెడతా అన్నారు ఆయన. 

తనపై తన పిల్లలపై వచ్చిన ఆరోపణలను ఖండించడం వరకు ఒకె. కానీ ఈ కొత్త ట్విస్ట్ ఏమిటన్నదే అసలు సిసలు ప్రశ్న. అల్లుడు శ్రీను సినిమా తరువాత బెల్లంకొండ సురేష్ నిర్మాతగా తెరవెనుకకు వెళ్లిపోయారు. 

పిల్లల కెరీర్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చూసుకుంటూ సైలంట్ గా వున్నారు. ఇప్పుడు పడ్డ కేసు పెద్ద విషయం కాదు. ఆధారాలు లేకుండా ఇలాంటివి నిలవవు. పైగా పలుకుబడి, డబ్బు వున్నవాళ్లకు ఇవన్నీ మామూలే. వాళ్ల లాయర్లు చూసుకుంటారు ఇలాంటివి అన్నీ.

అయితే ఇందులో రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చి చేరారు? అది ఎవరు అన్నది పాయింట్. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దీని వెనుక వున్నారని బెల్లంకొండ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఈ ఆరోపణలు చేసిన వ్యక్తికి సదరు రాజకీయ నాయకుడి బంధువులకు మధ్య సాన్నిహిత్యం వుందని తెలుస్తోంది. అందుకే ఆ రాజకీయ నాయకుడి అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని బెల్లంకొండ అనుమానిస్తున్నారని బోగట్టా.