ప్రభాస్ ..ఆల్ ఇండియా హీరో. వంద కోట్ల రెమ్యూనిరేషన్ అని టాక్. అలాంటి హీరో త్వరలో డైరక్టర్ మారుతి కాంబినేషన్ లో ముగ్గురు హీరోయిన్లతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి నిర్మాత డివివి దానయ్య. ఈ కాంబినేషన్ సెట్ కావడం వెనుక వేరే సంగతి వుంది.
నిర్మాత దానయ్య కిందా మీదా పడి ప్రశాంత్ నీల్ ను ఓ సినిమా కోసం ప్రభాస్ దగ్గరకు తీసుకెళ్లారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమా సెట్ అయింది కానీ దానయ్యకు కాలేదు.
అప్పుడు ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ ఎంత అన్నది తెలియదు కానీ జస్ట్ రెండు రోజుల క్రితం 75 కోట్లు దానయ్య సింగిల్ పేమెంట్ ప్రభాస్ కు ఇచ్చినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
రాధేశ్యామ్ సినిమా విడుదల టైమ్ లో అవసరం పడడంతో, ప్రభాస్ అడగడం, దానయ్య ఇవ్వడం జరిగిపోయిందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 75 కోట్లు అడ్వాన్స్ నా, టోటల్ రెమ్యూనిరేషన్ నే అదా అన్నది తెలియదు. మొత్తం మీద సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది.