ప్రముఖ నటి రేణూదేశాయ్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చేస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట' లో రేణూకు ఓ కీలక క్యారెక్టర్ దక్కిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్‌బాబుకు వదినగా రేణూ నటించనున్నారని సమాచారం.
ఈ విషయమై రేణూదేశాయ్తో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్టు సమాచారం. బ్యాంక్ స్కామ్‌ల నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. మహేశ్‌బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ తొలిసారిగా నటించనున్నారు.
సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నది. అయితే మహేశ్‌బాబు అభిమానులు మాత్రం ట్విటర్లో సర్కారు వారి పాట అనే హ్యష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో రేణూదేశాయ్ నటించనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా అభిమానులతో పాటు మహేశ్ అభిమానులు కూడా రేణూ రోల్‌కు సంబంధించి వివరాల కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.