పొట్ట చెక్క‌ల‌య్యే కామెడీ బాబోయ్‌…

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయన రియ‌ల్‌ లైఫ్‌లో సీరియ‌స్  రాజ‌కీయ నేత‌. ఇప్పుడు ఆయ‌న రీల్ లైఫ్‌ను త‌ల‌పించేలా ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. పోనీ ఒక‌ట్రెండు రోజులైనా దీక్ష సాగిందా అంటే…. అబ్బే అదేం…

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయన రియ‌ల్‌ లైఫ్‌లో సీరియ‌స్  రాజ‌కీయ నేత‌. ఇప్పుడు ఆయ‌న రీల్ లైఫ్‌ను త‌ల‌పించేలా ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. పోనీ ఒక‌ట్రెండు రోజులైనా దీక్ష సాగిందా అంటే…. అబ్బే అదేం లేదు. అదేంట‌య్యా అంటే, ఆయ‌న ఆక‌లితో అల‌మ‌టిస్తుంటే మ‌హిళ‌లు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నార‌ని చెబుతున్నారు. 

దీక్ష‌కు దిగిన ఆయన చేతిలో బాబా సాహెబ్ అంబేద్క‌ర్ చిత్ర ప‌టం, మ‌రోవైపు ఆయ‌న ఆశీస్సులు అందుకోడానికి ఏకంగా పెళ్లి దుస్తుల్లో దీక్షా శిబిరానికి వ‌చ్చిన నూత‌న జంట‌. బాబోయ్ …ఇలాంటి సినిమాటిక్ సీన్స్ భ‌లే న‌వ్వు తెప్పిస్తున్నాయంటే న‌మ్మండి.

పొట్ట చెక్కల‌య్యే కామెడీ అంటే ఇంత కాలం టీవీల్లో ప్ర‌సార‌మ‌య్యే ఏ కామెడీ షో గురించో చెప్పుకున్నాం. కానీ ఆయ‌న న‌వ్వ‌కుండానే చూప‌రులకు పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వు తెప్పించి గొప్ప హాస్య న‌టుడ‌ని అనిపించుకున్నారు. ఆయ‌న పేరే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే.  

తాడిపత్రిలో గత నెల 24న చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారంటూ తాడిపత్రి త‌హ‌శీల్దార్  కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని  ఇటీవ‌ల జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో జేసీ దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు.  

పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి నల్లదుస్తులు ధరించి ఇంటి వెలుపలే దీక్షకు దిగారు. దీక్ష‌కు దిగిన కాసేప‌టికే మ‌హిళ‌లు ఆయ‌న‌కు నిమ్మ‌ర‌సం ఇచ్చి విర‌మింప‌జేశారు.  ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు దీక్ష‌ల ప‌ర్వంతో పోరాటం ప్రారంభ‌మైంద‌న్నారు.  

సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామం, ప్రతి గడప తిరిగి జ‌నాన్ని చైత‌న్య‌ప‌రుస్తాన‌న్నారు. తాడిపత్రి నియోజవర్గ ప్రజల ప్రేమాభిమానాలు చూస్తుంటే త‌న‌కు ఎంతో ఆవేద‌న క‌లుగుతోంద‌న్నారు.  వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి త‌న‌ ఇంట్లోకి వచ్చి, దౌర్జన్యం చేసి వెళ్లారన్నారు.  తాడిపత్రి ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నార‌న్నారు.

గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు నేరుగా సాక్షి ఎడిష‌న్ కార్యాల‌యం వ‌ద్ద‌కెళ్లి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చేసిన రాద్ధాంతాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తు చేసుకుంటున్నారు. నాడు వైఎస్ కుటుంబంపై మాట్లాడిన మాట‌ల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చుకుంటున్నారు. 

నేడు మాత్రం తానేదో శాంతి స్వ‌భావం క‌లిగిన నేత‌గా , న‌ల్ల దుస్తులు ధ‌రించి, చేతిలో అంబేద్క‌ర్ చిత్ర ప‌టం, కొంద‌రు మ‌హిళ‌ల‌ను ర‌ప్పించుకుని సీన్ క్రియేట్ చేయ‌డాన్ని జ‌నం ఓ కామెడీ స్కిట్‌గా మాత్ర‌మే చూస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు