అయ్యన్న తీర్పు ఇచ్చేశారు.. బాబు ఇక‌ పండుగ చేసుకోవడమే…!

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే కూడా సీనియర్. అందువల్ల ఆయన అనుభవం ఎపుడూ ఘనమైనదే. అందుకే బాబుకు కూడా రాని డౌట్లూ, కొత్త…

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే కూడా సీనియర్. అందువల్ల ఆయన అనుభవం ఎపుడూ ఘనమైనదే. అందుకే బాబుకు కూడా రాని డౌట్లూ, కొత్త ఆలోచనలూ ఆయనకు ఎన్నో  వస్తూంటాయి.

ఏపీలో దేవతా విగ్రహాల మీద వరసగా దాడులు జరుగుతూంటే ఇప్పటిదాకా ఆ నిందితులు ఎవరూ అన్నది ఎవరూ తేల్చలేకపోతున్నారు. చంద్రబాబు అయితే జగన్ సర్కార్ ఈ విషయంలో ఫెయిల్యూర్ అయిందని మాత్రమే అంటున్నారు.

కానీ అయ్యన్నపాత్రుడు మాత్రం ఏకంగా దోషులు ఎవరో చెప్పేశారు. ఏపీలో దేవతా విగ్రహాల దాడుల వెనక ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతం సవాంగ్ ఉన్నారట. వారిద్దరే హిందూ మతాన్ని సర్వనాశనం చేయడానికి ఈ దాడులు చేయిస్తున్నారుట.

మరి అయ్యన్న తీర్పు ఇచ్చేశాక అప్పీలు ఏముంటుంది, చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా పండుగ చేసుకోవాల్సిందే. మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన అయ్యన్న నోటి వెంట ఇలాంటి మాటలు రావడం దారుణమే అయినా ఆశ్చర్యం లేదని మాత్రం వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన అలా మాట్లాడకపోతేనే విడ్డూరం అని కూడ సెటైర్లు వేస్తున్నారు.

పనిలో పనిగా సోము వీర్రాజు మీద కూడా అయ్యన్న హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో హిందూ మతానికి ఇంతలా ముప్పు వాటిల్లుతూంటే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఏం చేస్తున్నారంటూ అయ్యన్న నిలదీస్తున్నారు. 

అవును మరి టీడీపీ హిందూత్వ కార్డుని భుజానికెత్తుకున్నాక కాషాయం పార్టీకి పెద్దగా పని ఏముందని ఆయన గమ్మునున్నారేమో. మొత్తానికి అయ్యన్న అసహనం అంతా మీడియా ముఖంగా వైసీపీ సర్కార్ మీద చూపించేశారుగా.

దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు