కుర్ర హీరో ఆత్మవిశ్వాసం?

దేనికి ఈ ఆటిట్యూడ్ ? మొదటి సినిమాకే మూడు బెస్ట్ యాక్టర్ ఇంటర్నేషనల్ అవార్డులు గెలిచినందుకా ? లేదా మొదటి సినిమానే ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ గా చూస్తున్నందుకా ?…

దేనికి ఈ ఆటిట్యూడ్ ? మొదటి సినిమాకే మూడు బెస్ట్ యాక్టర్ ఇంటర్నేషనల్ అవార్డులు గెలిచినందుకా ? లేదా మొదటి సినిమానే ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ గా చూస్తున్నందుకా ? లేదా ఇంకేమైనా ఉందా? ఇటీవలే వచ్చిన హాఫ్ బీట్ సినిమా మట్టి కథ హీరో ఆ సినిమాలో తన ఆన్ స్క్రీన్ యాక్టింగ్ ను పక్కన పెడితే అతని ఆఫ్ స్క్రీన్ ఆటిట్యూడ్ వల్ల అందరి దృష్టి అతని వైపు మళ్లీంది.

కొత్త హీరో అయి ఉండి జనాల ముందుగానీ మీడియా ముందుగానీ తన మనసులో ఉన్నది ఉన్నట్లు తనకిష్టం వచ్చిన స్టైల్ లో మాట్లాడడం తన స్ట్రాటజీ లో భాగమేనా? ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఈవెంట్లో “బరాబర్ అయితది!!” అనే నినాదాన్ని పట్టుకొని తిరగడం ఈసారి వర్క్ అవుట్ అయిందని మళ్లీ మళ్లీ ప్రయోగిస్తే తప్పకుండా బెడిసి కొట్టే అవకాశాలున్నాయి.

అతనికి కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే కానీ ఇండస్ట్రీలో దీన్ని అహంకారంగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆటిట్యూడ్ తో వచ్చిన రీసెంట్ హీరోల్లో కొందరు హిట్ కొందరు ఫట్.. ఇది ఈయన మొదటి సినిమానేగా.. చూద్దాం.. అజయ్ వేద్ ఏ దిశగా వెళ్తాడో…