ప్రతి సంక్షేమ పథకానికి విగ్రహాల విధ్వంసమా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తేల్చిపారేశారు. ఏం తేల్చి పారేశారు? రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసం చేస్తోంది ప్రతిపక్షాలేనని కుండబద్దలు కొట్టారు.  Advertisement ఆయన ప్రతిపక్షాలు అని చెప్పినా ప్రధానంగా తెలుగుదేశం పార్టీయే ఈ అరాచకం చేస్తోందని…

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తేల్చిపారేశారు. ఏం తేల్చి పారేశారు? రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసం చేస్తోంది ప్రతిపక్షాలేనని కుండబద్దలు కొట్టారు. 

ఆయన ప్రతిపక్షాలు అని చెప్పినా ప్రధానంగా తెలుగుదేశం పార్టీయే ఈ అరాచకం చేస్తోందని అర్ధం. అయితే జగన్ చెప్పింది కాస్త విచిత్రంగా ఉంది. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక ఇలా అరాచకానికి పాల్పడుతున్నాయని జగన్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పలుమార్లు చెప్పారు. 

సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఇలాగే చెబుతుంటుంది. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం ఏయే మంచిపనులు చేసినప్పుడు ఏ ఆలయాలు, ఏ విగ్రహాలు ధ్వంసం అయ్యాయో జాబితా చదివారు.

అంటే ప్రభుత్వం ఓ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినపుడల్లా ఓ విగ్రహం ధ్వంసం అయిందన్నమాట. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయన్నమాట. 

ఎండోమెంట్ పరిధిలోకి కూడా రాని, తెలుగుదేశం నేతల పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లోని  విధ్వంస  ఘటనలు జరుగుతున్నాయంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు.  

పద్ధతి ప్రకారం.. కుట్రలు చేస్తున్నారని, పొలిటికల్ గొరిల్లా వార్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి, పోలీసులకు చెడ్డపేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని, వీటిని ఎలా అరికట్టాలన్న దానిపై కూడా మేదోమథనం చేయాలని సీఎం జగన్ అన్నారు.

''దేవుడన్నా భయం లేకుండా పోతోంది. దేవున్ని కూడా రాజకీయాలలోకి తీసుకొస్తున్నారు. ఎక్కడో మారు మూల ప్రాంతాలలో గుళ్ళలో విగ్రహాలను ఎంచుకుని ధ్వంసం చేస్తుంటే, అక్కడ ప్రతిపక్షాలు ఆగడాలకు దిగుతున్నాయి. 

అలాంటి కేసులను కూడా సమర్థవంతంగా తేల్చగలగాలి. దేవుడి విగ్రహాలు కూల్చితే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలకు పాల్పడుతున్నారో.. ప్రజలు ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఏదైనా మంచి కార్య‌క్ర‌మం జరిగి పబ్లిసిటీ వస్తుందని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు చేస్తున్నారు.

2019లో నాడు-నేడుకు ప్రాధాన్యత వస్తుందని తెలిసి దుర్గ గుడి ధ్వంసం అని దుష్ప్రచారం చేశారు.

2020 జనవరిలో రైతులకు ధరల స్థిరీకరణ చేస్తే ఆంజనేయ స్వామి గుడి ధ్వంసం అని దుష్ప్రచారం చేశారు. 

దిశ పోలీస్ స్టేషన్ పబ్లిసిటీని అడ్డుకోవడం కోసం కొన్ని గుడులను ధ్వంసం చేసి, రధం కాలిపోయిందని ప్రచారం చేశారు. 

మహిళల సంపూర్ణ వికాసం కార్యక్రమం చేస్తే అంతర్వేది రధం కాలిందని ప్రచారం చేశారు. వెండి సింహాలు మాయం అయ్యాయన్నారు. 

రైతు జలసిరి కార్యక్రమం మొదలు పెడితే నెల్లూరులో ఓ ఆలయంలో విగ్రహం ధ్వంసం అయ్యింది. 

విద్యాదీవెనకు మూడు రోజుల ముందు నుంచే ధ్వంస రచన జరిగింది. కర్నూలులో లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఘటన జరిగింది. 

బీసీల కోసం చరిత్రాత్మక చర్యలు చేపడితే వీరభద్ర స్వామి ఆలయం ధ్వంసం అన్నారు. 

ఇంటి పట్టాలు ఇస్తుంటే  తిరుమల ఆలయంలో పూర్ణకుంభం లైటింగ్ లో శిలువ ఉందని  ప్రచారం చేశారు. 

విజయనగరంలో ఇంటి పట్టాలు ఇస్తున్నారని తెలిసి రాముల వారి ఆలయంలో దాడి చేశారు'' అని అని జగన్ కామెంట్ చేశారు. 

సరే జగన్ చెప్పినట్లుగానే టీడీపీ వాళ్ళే ఈ అరాచకాలు చేస్తుంటే వాళ్ళను పట్టుకొని జనం ముందుకు ఎందుకు తీసుకురావడంలేదు? మొత్తం మీద ఏపీలో విగ్రహ విధ్వంస రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటికే నడుస్తున్న కుల రాజకీయాలకు ఇది బోనస్ అన్నమాట. 

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు