ఆ మీడియాకు హైకోర్టు బిగ్ షాక్!

వైయస్ అవినాష్ రెడ్డి కేసులో ఒక వర్గం మీడియా చేసిన ఓవరాక్షన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్…

వైయస్ అవినాష్ రెడ్డి కేసులో ఒక వర్గం మీడియా చేసిన ఓవరాక్షన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం లక్ష్మణ్ ఎల్లో మీడియాపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. మే 26న రెండు ఎల్లో మీడియా ఛాన‌ల్స్ లో కోర్టుల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ వీడియో క్లిప్‌లను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆయన ఆదేశించారు.

గ‌త వారం తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డంతో రెచ్చిపోయిన ఎల్లోమీడియా హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు.. ఓ టీవీ చర్చల్లో జడ్జికి డబ్బు సంచులు వెళ్లాయని అరోప‌ణ‌లు చేయ‌డంతో వాటిని కోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించి ఆ మీడియాలలో వచ్చిన వీడియోలను కోర్టుకు అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

గత కొంతకాలంగా మీడియా ముసుగులో డిబేట్ల్ పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్లు అవినాష్ రెడ్డి, కోర్టుల‌పై రెచ్చిపోతున్న ఎల్లోమీడియాకు తాజా హైకోర్టు తీర్పు షాక్ ఇచ్చింది. గ‌త వారం అవినాష్ రెడ్డి త‌ల్లికి అనారోగ్యం కార‌ణంగా క‌ర్నూల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఎల్లో మీడియాలో చేసిన హ‌డ‌వుడి గురించి అంద‌రికి తెలిసిందే. తీరా హైకోర్టులో అవినాష్ రెడ్డికి కాస్త ఉప‌శ‌మ‌నం రాగానే వారిలోని ఉక్రోషం అంత‌ వెళ్లగక్కుతూ కోర్టుల‌పై రెచ్చిపోయి మాట్లాడారు.

కాగా ఈ రోజు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కు అనుమతించిన కోర్టు కొన్ని షరతులను సూచించింది. ప్రతి శనివారం సీబీఐ ముందు హాజరు కావాలన్న కోర్టు..సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని సూచించింది. సీబీఐ విచారణకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:15 నిమిషాల మధ్య హాజరుకావాలని సూచించింది. జూన్ 19 వరకు కూడా సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.