బాలయ్య లీక్ చేసిన టైటిల్!

మొత్తానికి బాలయ్య-అనిల్ రావిపూడి టైటిల్ బయటకు వచ్చేసింది. ఇది ఎలా బయటకు వచ్చి వుంటుందా అని యూనిట్ బుర్రలు బద్దలు కొట్టుకుంది. ఆఖరికి బాలయ్య ఏదో మాటల విషయంలో తన దగ్గరకు వచ్చిన ఓ…

మొత్తానికి బాలయ్య-అనిల్ రావిపూడి టైటిల్ బయటకు వచ్చేసింది. ఇది ఎలా బయటకు వచ్చి వుంటుందా అని యూనిట్ బుర్రలు బద్దలు కొట్టుకుంది. ఆఖరికి బాలయ్య ఏదో మాటల విషయంలో తన దగ్గరకు వచ్చిన ఓ నిర్మాతకు తన పాత్ర పేరు చెప్పి, అందులోంచే టైటిల్ వుంటుందని చెప్పారని, ఆ నిర్మాత ద్వారా అందరికీ తెలిసిపోయి వుంటుందనీ లెక్కలు కట్టుకున్నారు.. మంచిదే..ఎప్పుడో ఒకప్పుడు బయటకు రావాల్సిందే కదా.

భగవత్ కేసరి అన్న టైటిల్ ఎలా పుట్టినట్లు అసలు? అఖండ సినిమా టైటిల్ శివుడికి సింబాలిజమ్ కాబట్టి, ఈసారి విష్ణువు పేరు స్ఫురించేలా టైటిల్ కోసం వెదికారు అనిల్ రావిపూడి. 

భగవంతుడు..భగవత్ అనేది విష్ణురూపంగా భావించి అక్కడ ఫిక్స్ అయ్యారు. బాలయ్య అంటే సింహం సెంటిమెంట్. కేసరి అంటే మీనింగ్ అదే కదా. సింహం అనే కదా. పంజాబ్ కేసరి, ఆంధ్ర కేసరి అన్న పలుకుబడులు వుండనే వున్నాయి కదా.

అందుకే భగవత్ కేసరి అనే కొత్త టైటిల్ పుట్టుకువచ్చింది. పైగా హిందీ లో డబ్ చేసుకున్నా, హిందీకి వేరే టైటిల్ అక్కరలేదు. పక్కాగా నార్త్ ఇండియాకు కూడా సరిపోయే టైటిల్ ఇది. కొన్నాళ్లు నానితే..భగవత్ కేసరి..అనేది క్యాచీ టైటిల్ అయిపోతుంది.