కోయ్ బాబూ కోయ్..రోజుకు కోటి

వినేవాడు వెర్రివాడయితే చెప్పేవాడు చంద్రబాబు అని కిట్టని ప్రతిపక్ష జనాలు అంటూ వుంటారు. సరే, రాజకీయ నాయకులు ఇటైనా, అటైనా అలాగే వుంటారు అని సరిపెట్టుకోవచ్చు. కానీ మీడియా అలా కాదు కదా.  Advertisement…

వినేవాడు వెర్రివాడయితే చెప్పేవాడు చంద్రబాబు అని కిట్టని ప్రతిపక్ష జనాలు అంటూ వుంటారు. సరే, రాజకీయ నాయకులు ఇటైనా, అటైనా అలాగే వుంటారు అని సరిపెట్టుకోవచ్చు. కానీ మీడియా అలా కాదు కదా. 

మీడియా విషయాలు రిపోర్ట్ చేస్తుంది లేదా. విషయాల మీద తన కామెంట్ ఇస్తుంది. లేదూ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఇలా జరిగిందిట..అలా జరిగిందిట అన్న గ్యాసిప్ లు అందిస్తుంది. అయితే ఈ గ్యాసిప్ ట్రెండ్ అన్నది వెబ్ మీడియా నుంచి ప్రింట్ మీడియా అంది పుచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

వెబ్ మీడియా అన్నా కాస్త ఆచి తూచి, తెలుసుకోవడానికి ప్రయెత్నించి మరీ గ్యాసిప్ లు అందిస్తోంది. కానీ ప్రింట్ మీడియా ఆ గీత కూడా దాటేసినట్లు కనిపిస్తోంది. పైగా ఎడిటోరియల్ కామెంట్ లో గ్యాసిప్ ను చేర్చడం అనే కొత్త ట్రెండ్ ను ఘనత వహించిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే ఉరఫ్ రాధాకృష్ణ గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఈవారం కొత్త పలుకులో ఆయన ప్రవచించిన మాటలు ఇవి. 

''…రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులకు ఫీజు కింద చెక్కుల ద్వారా ఇచ్చే మొత్తం కాకుండా, సొంతంగా నగదు చెల్లిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తున్నారు…'' 

''..దానికి సంబంధించిన కేసులలో రైతుల తరఫున వాదించకుండా ఉండటానికై ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదికి రోజుకు కోటి వంతున, విచారణ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులకు చెల్లిస్తామని జగన్‌ తరఫు దూతలు ఆశ చూపడం నిజం కాదా?..''

ఈ రెండు విషయాలు ఇప్పుడు రుజువు చేయాల్సిన అగత్యం ఇరు వైపులా వుంది. ముఖ్యంగా ప్రభుత్వం తరపున ఫీజు, తన తరపున నగదు ఇవ్వడం అన్నది. ఎందుకంటే నగదు లావాదేవీలు చట్ట ప్రకారం నిషేధం. ఓ ముఖ్యమంత్రి అలా చేస్తే అది తప్పు అవుతుంది కదా? మరి అలా చేస్తున్నారన్న ఆరోపణ లేదా కామెంట్ నిగ్గు తేల్చాల్సిన అవసరం వుంది. 

ఇక రెండో విషయం చూద్దాం. రాజధాని రైతుల తరపున కేసులు వాదించవద్దని ఢిల్లీలో ఓ న్యాయవాదికి రోజుకు కోటి రూపాయలు, అది కూడా కేసు ఎన్నాళ్లు నడిస్తే అన్నాళ్లు ఇవ్వడానికి ఆశ చూపించారట. సరే సదరు న్యాయవాది చాలా గొప్పవారు అయి వుండొచ్చు.  కేసు వాదించకుండా వుండాలంటే రోజుకు కోటి ఇస్తాం అన్నారు అంటే ఇంతకూ వాదిస్తే సదరు న్యాయవాది ఎంత తీసుకుంటారో?

అలాంటి న్యాయవాదిని వాదించవద్దు అన్నారు అంటే ఆయనను రైతు ఉద్యమనేతలు పెట్టుకునే ఆలోచనలో వున్నారనేగా అర్థం? అంటే వారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్దమైనట్లు? రైతులు అన్ని కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? దాని వెనుక ఎవరు వున్నారు? చెప్పాలిగా?

పైగా ఇప్పటికే రాజధాని రైతుల తరపున వాదిస్తున్న న్యాయవాదులు ఎంతటి గొప్పవారో, వారి ఫీజులు ఏ రేంజ్ లో వుంటున్నాయో కథలు కథలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి ఆ సంగతి ప్రస్తావించడం మానేసి, రివర్స్ లో రాయడం అంటే ఏమనుకోవాలి? కోయ్ బాబూ కోయ్…కోటి కోతలు అనాలేమో?

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి