నాడు రామతీర్ధాలు పట్టని బాబు ఇపుడు రచ్చ రచ్చ?

రాములోరి కోవెల అంటే ఉత్తరాంధ్రాలో రామతీర్ధాలునే ఠక్కున‌ చెబుతారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల దగ్గర ఉన్న రామతీర్ధాలులో ప్రతీ ఏటా శ్రీరామనవమి వేడుకలు కడు వైభవంగా జరుగుతాయి. ఉత్తరాంధ్రా భద్రాద్రి అని కూడా రామతీర్ధాలుకి…

రాములోరి కోవెల అంటే ఉత్తరాంధ్రాలో రామతీర్ధాలునే ఠక్కున‌ చెబుతారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల దగ్గర ఉన్న రామతీర్ధాలులో ప్రతీ ఏటా శ్రీరామనవమి వేడుకలు కడు వైభవంగా జరుగుతాయి. ఉత్తరాంధ్రా భద్రాద్రి అని కూడా రామతీర్ధాలుకి మరో పేరు.

ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీ విభజన తరువాత కచ్చితంగా రామతీర్ధాలుని రెండవ భద్రాద్రిగా చంద్రబాబు అభివృద్ధి చేస్తారని అంతా ఆశించారు. అంతే కాదు, రామతీర్ధాలులోనే అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహించమని కూడా ఇక్కడ నుంచి ఆస్తిక జనులు ప్రజా ప్రతినిధులు కూడా నాటి ముఖ్యమంత్రి బాబుని కోరారు.

కానీ బాబు మాత్రం ససేమిరా అన్నారు. అంతే కాదు, నాటి నుంచి కనీసం ఆలయాన్ని అభివృద్ధి కూడా చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఇపుడు బాబు రాజకీయం చేయడం కోసమే రామతీర్ధాలు టూర్ వేశారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఘాటుగానే విమర్శించారు.

విజయనగరం ఎన్నో సార్లు వచ్చిన బాబుకు రామతీర్ధాలు అన్నది ఒకటి ఉందని కూడా తెలియదని, ఇపుడు మాత్రం నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని మరీ అపర రామ భక్తుడిగా రంగంలోకి దిగిపోవడాన్ని చూసిన మేధావులు, ప్రజా సంఘాల నేతలు కూడా ఇదేమి రాజకీయమని విస్తుబోతున్నారు. మొత్తానికి రాముడు కంటే ప్రసాదం మీదనే తనకు భక్తి  ఎక్కువ‌అని బాబు టూర్ ద్వారా చాటుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి