సినీనిర్మాణంలోకి సివిఎమ్

సివిఎమ్ అనే సివి మోహన్ పేరు పెద్దగా సినిమా అభిమానులకు తెలియదేమో కానీ సినిమా రంగంలోని వారికి తెలుసు. మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరిగా వుంటూ పలు సినిమాలు నిర్మించారు.  Advertisement కానీ భాగస్వాముల్లో…

సివిఎమ్ అనే సివి మోహన్ పేరు పెద్దగా సినిమా అభిమానులకు తెలియదేమో కానీ సినిమా రంగంలోని వారికి తెలుసు. మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరిగా వుంటూ పలు సినిమాలు నిర్మించారు. 

కానీ భాగస్వాముల్లో వచ్చిన అభిప్రాయ బేధాలతో ఆయన ఆ సంస్థను వదిలేసి, నిర్మాణానికి దూరం అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆయనే స్వంతగా సినిమా నిర్మాణాలు చేపట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. 

ఈసారి భాగస్వాములు లేకుండా సోలోగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో బ్యానర్ రిజస్ట్రేషన్ లాంటి వ్యవహారాలు పూర్తి చేసి, రంగంలోకి దిగుతారు.

ముందుగా రెండు మీడియం సినిమాలు నిర్మించిన తరువాత పెద్ద సినిమా నిర్మించే ఆలోచనలు చేస్తున్నారు. నిజానికి మైత్రీ మూవీస్ ను సూపర్ స్టార్ మహేష్ కు దగ్గర చేసింది సివిఎమ్ అనే టాక్ వుంది. అందువల్ల ఆ పెద్ద సినిమా మహేష్ తోనే వుండొచ్చు అని తెలుస్తోంది.

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం