జంబ…జాంబియా..

ఈవీవీ సత్యనారాయణ జంబలకిడిపంబ సినిమాను అంత తేలిగ్గా ఎవ్వరూ మరిచిపోలేరు. అల్టిమేట్ కామెడీ సినిమా అది.  Advertisement ఏదో చిత్రమైన మందును నీళ్లలో కలిపితే జనాల్లో వచ్చే ఫన్నీ రియాక్షన్ నుంచి పుట్టుకు వచ్చే…

ఈవీవీ సత్యనారాయణ జంబలకిడిపంబ సినిమాను అంత తేలిగ్గా ఎవ్వరూ మరిచిపోలేరు. అల్టిమేట్ కామెడీ సినిమా అది. 

ఏదో చిత్రమైన మందును నీళ్లలో కలిపితే జనాల్లో వచ్చే ఫన్నీ రియాక్షన్ నుంచి పుట్టుకు వచ్చే ఫన్ ఆధారంగా నడిచే కథ అది. మళ్లీ అలాంటి లైన్ ను కాస్త భయం, మరికాస్త నవ్వు పుట్టించేలా డీల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది దర్శకుడు ప్రశాంత్ వర్మ 'జాంబియారెడ్డి'. 

భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో జాంబియా అనే చిత్రమైన వ్యాధి, దాని వల్ల జనాలను కొరకడం అనే చిత్రమైన అలవాటు రావడం లాంటి థీమ్ ను తీసుకున్నట్లు కనిపిస్తోంది. 

ఫన్ గా స్టార్ట్ అయిన ట్రయిలర్ మెలమెల్లగా ఈ భయంకరమైన కొరుకుడు లోకి ప్రవేశించి, అక్కడి నుంచి మరీ భయంకరమైన టర్న్ తీసుకుంది. ముఖ్యంగా ట్రయిలర్ ఆఖరి సీన్ చూస్తే కాస్త దడపుట్టించేలా వుంది.

పైగా ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. ఈ సంక్రాంతికి జాంబీలు వస్తున్నారంటూ బెదిరింపు ఒకటి. మొత్తం మీద సంక్రాంతికి వస్తుందో రాదో కానీ, సినిమా కంటెంట్ చూస్తుంటే పిచ్చెక్కించేలా వుంది.