పాపం..క్రిష్

డైరక్టర్ క్రిష్ కు కరోనా పాజిటివ్ వచ్చిన వార్త గుప్పుమంది. పాజిటివ్ అన్నంత మాత్రాన భయపడాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒక్కొక్కరికి వస్తూనే వుంది తగ్గుతూనే వుంది. అందువల్ల అది భయపడాల్సినంత సమస్య కాదు. …

డైరక్టర్ క్రిష్ కు కరోనా పాజిటివ్ వచ్చిన వార్త గుప్పుమంది. పాజిటివ్ అన్నంత మాత్రాన భయపడాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒక్కొక్కరికి వస్తూనే వుంది తగ్గుతూనే వుంది. అందువల్ల అది భయపడాల్సినంత సమస్య కాదు. 

కానీ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా షూట్ కు మళ్లీ బ్రేక్ పడేట్టు కనిపిస్తోంది. ఎఎమ్ రత్నం నిర్మాతగా క్రిష్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభమైంది. 

కాస్త వర్క్ చేసారో లేదో, వకీల్ సాబ్ మీదకు వెళ్లిపోయారు. పైగా కరోనా సమస్య ఒకటి. ఆఖరికి క్రిష్ ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేసేసారు. కరోనాకు భయపడకుండా ఆ సినిమాను ఫినిష్ చేసారు.

ఈలోగా పవన్ అయ్యప్పన్ రీమేక్ కు ఓకె  అన్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ అలాగే వుంది. దానికి బోలెడు కట్టాల్సి వస్తోంది. కనీసం ఆ సెట్ లో వర్క్ అన్నా పూర్తి చేయమని క్రిష్ పదే పదే పవన్ ను కోరాల్సి వచ్చింది. ఆఖరికి ఆయన కరుణంచి, ఈ వారంలో డేట్ లు ఇచ్చారు.

ఇలాంటి టైమ్ లో క్రిష్ కు కరోనా పాజిటివ్. మరి ఇప్పుడు షూట్ పరిస్థితి ఏమిటో? ఇప్పుడు చేయకపోతే, త్వరలో అయ్యప్పన్ రీమేక్ మీదకు పవన్ వెళ్లిపోతారు. ఆయన ఆ సినిమా పూర్తి చేసి వచ్చేవరకు ఈ సెట్ అలా వుండాల్సిందే. లేదా మధ్యమార్గం ఏమైనా కనిపెడతారో..చూడాలి.

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం