స‌లార్ లో మ‌రో స్టార్ హీరో!

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ ఎత్తున తెర‌కెక్కుతున్న స‌లార్ సినిమాకు సంబంధించి ఆస‌క్తిదాయ‌క‌మైన అప్ డేట్ వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌భాస్ ధ్రువీక‌రించాడు. ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో…

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ ఎత్తున తెర‌కెక్కుతున్న స‌లార్ సినిమాకు సంబంధించి ఆస‌క్తిదాయ‌క‌మైన అప్ డేట్ వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌భాస్ ధ్రువీక‌రించాడు. ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ న‌టిస్తున్నార‌నేది యంగ్ రెబ‌ల్ స్టార్ చెప్పిన విష‌యం.

త‌న తాజా సినిమా రాధేశ్యామ్ మ‌ల‌యాళ ప్ర‌చారంలో భాగంగా ప్ర‌భాస్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. పృథ్విరాజ్ సార్ త‌మ సినిమాలో న‌టిస్తుండ‌టం చాలా ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని ప్ర‌భాస్ చెప్పాడు. త‌ద్వారా ఈ సినిమా స్టార్ కాస్ట్ కు సంబంధించిన కీల‌క‌మైన విష‌యాన్ని ప్ర‌భాస్ వెల్ల‌డించాడు.

స‌లార్ గురించి మాట‌ల్లో చెప్ప‌లేమ‌ని, అద్భుతంగా ఉంటుంద‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌మ‌ని ప్ర‌భాస్ ఊరిస్తున్నాడు. పృథ్విరాజ్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడ‌నే అప్ డేట్ ద్వారా ఆ సినిమాపై కేర‌ళ‌లోనే కాదు, బ‌య‌ట కూడా క్రేజ్ ను మ‌రింత‌గా పెంచాడు ఈ హీరో.

అడ‌పాద‌డ‌పా ఇత‌ర భాష‌ల సినిమాల్లో న‌టిస్తూ కూడా పృథ్విరాజ్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ వ‌స్తున్నాడు. అయ్య‌ప్ప‌న్ కోషీయుం ద్వారా కేర‌ళ ఆవ‌ల కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న పృథ్విరాజ్ తోడ‌వ్వ‌డం స‌లార్ కు కూడా పెద్ద ప్ల‌స్ పాయింట్ కానుంది.