ఛీ..ఛీ..ఛీ – సిగ్గులేదా?

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నిస్సిగ్గుగా భార్య భువ‌నేశ్వ‌రిని ప‌దేప‌దే చంద్ర‌బాబు తెర‌పైకి తెస్తున్నార‌ని నెటిజ‌న్లు ఛీ, చీ అంటూ అస‌హ్యించుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. త‌న…

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నిస్సిగ్గుగా భార్య భువ‌నేశ్వ‌రిని ప‌దేప‌దే చంద్ర‌బాబు తెర‌పైకి తెస్తున్నార‌ని నెటిజ‌న్లు ఛీ, చీ అంటూ అస‌హ్యించుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. త‌న భార్య‌ను అసెంబ్లీలో కించ‌ప‌రిచేలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రించార‌ని, అందుకు నిర‌స‌న‌గా అసెంబ్లీ స‌మావేశాల‌ను చంద్ర‌బాబు బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ చంద్ర‌బాబు మాట్లాడుతూ మ‌రోసారి భార్య భువ‌నేశ్వ‌రిని రాజ‌కీయ తెర‌పైకి తేవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే… “మహిళల క్యారెక్టర్‌ను దెబ్బ కొట్టడం వైసీపీ పనిగా పెట్టుకుంది. అసెంబ్లీలో నా భార్యను కించపరిచారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ.. ఇప్పుడు కానీ.. భువనేశ్వరి ఎప్పుడైనా రాజకీయాల్లో కన్పించారా?” అని చంద్ర బాబు ప్రశ్నించారు. రాజ‌కీయాల్లో ఇంత‌కంటే దిగ‌జారుడుత‌నం ఏదైనా ఉంటుందా? అని సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు వైఖ‌రిపై ట్రోల్ చేస్తున్నారు.

గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుపై టీడీపీ ఎమ్మెల్యేలు వ్య‌క్తిగ‌త దాడికి పాల్ప‌డ‌డంతో ఆయ‌న అదే స్థాయిలో కౌంట‌ర్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో చంద్ర‌బాబుకు దుఃఖం క‌ట్టలు తెంచుకుంది. తాను చంద్ర‌బాబునాయుడి స‌తీమ‌ణిని ఏమీ అన‌లేద‌ని, ఏదో జ‌రిగిపోయింద‌ని రాజ‌కీయ స్వార్థంతో చంద్ర‌బాబు నాట‌కాన్ని ర‌క్తి క‌ట్టించార‌ని వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగారు.

ఆ త‌ర్వాత వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన సంద‌ర్భంలోనూ చంద్ర‌బాబు ఊరూరా త‌న భార్య భువ‌నేశ్వ‌రి అంశాన్నే ప్ర‌స్తావిస్తూ సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ప్ర‌జ‌ల నుంచి ఆశించిన మేర‌కు సానుభూతి, ఆద‌ర‌ణ ల‌భించ‌లేద‌నే ఉద్దేశంతో చంద్ర‌బాబు త‌న ప్ర‌య‌త్నాల్ని కొన‌సాగిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

దివంగ‌త మాజీ మంత్రి ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి పేరు ప్ర‌స్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అసెంబ్లీ బ‌య‌ట అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పి వివాదానికి ముగింపు ప‌లికారు.

కానీ చంద్ర‌బాబు మాత్రం జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేసేందుకు భువ‌నేశ్వ‌రి అవ‌మాన ఎపిసోడ్‌ను అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇల్లాలికి సంబంధించి సున్నిత అంశాన్ని బ‌జారుకు తీసుకురావ‌డం ఒక్క చంద్ర‌బాబుకే చెల్లింద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. 

ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న వేళ చంద్ర‌బాబు త‌న స‌తీమ‌ణిని అవ‌మానించార‌ని మ‌హిళా నెటిజ‌న్లు మండిప‌డు తున్నారు. రాజ‌కీయాల కోసం మ‌హిళ‌ల‌ను బ‌లి పెట్టొద్ద‌ని, అధికారం కోసం మ‌రో మార్గాన్ని చూసుకుంటే మంచిద‌ని చంద్ర‌బాబుకు హిత‌వు చెబుతున్నారు.

7 Replies to “ఛీ..ఛీ..ఛీ – సిగ్గులేదా?”

  1. chee anaalsindhi ykaapa vaallani kadhaa…. eppudo poyina madhava reddy ki ranku katti assembly saakshigaa vimarsalau chesi navvukunnadhi evvaru…. prajalu vinnaru…. sari ayina nirnayam theesukunnaru

  2. కొన్నింటికి క్షమాపణలు తో పరిస్కారాలు వుండవు దండనలు ఉంటాయి మొరొకడు చెయ్యకుండా ఉండాలంటే భయపడే విధంగా దండన ఉండాలి లేకపోతె ప్రతివాడు మహిళలను అవమానించి క్షమాపణలు చెపుతూ వుంటారు

Comments are closed.