బాహుబలి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? ఇది ఇప్పటికీ జవాబు తెలియని ప్రశ్న. ప్రభాస్ కూడా జవాబు చెప్పని ప్రశ్న. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన ప్రభాస్ కు ఎందుకు పెళ్లి కావడం లేదు అన్నది ఆయనకు, ఇంట్లోవాళ్లకే తెలియాలి.
అయితే ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని గంట భజాయించి మరీ చెబుతున్నాడు ఓ జ్యోతిష్కుడు. ప్రభాస్ జన్మ సమయం ప్రకారం చూసుకుంటూ పెళ్లి ఘడియ వచ్చినట్లే అని, గ్రహాలు అన్నీ అనుకూలంగా వున్నాయని అంటున్నాడు ఆచార్య వినోద్ కుమార్ అనే జ్యోతిష్కుడు.
ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో కూడా పోస్ట్ చేసాడు. ఆచార్య వినోద్ కుమార్ అనే ఈ వెరిఫైడ్ అక్కౌంట్ నుంచి పోస్ట్ చేసిన అక్కౌంట్ లో, ప్రస్తుతం గ్రహాలు అన్నీ పెళ్లి ఘడియకు అనుకూలంగా మారుతున్నాయని, ఈ ఏడాదే మంచి సంబంధం కుదిరి పెళ్లి అవుతుందని చెబుతున్నారు.
ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు. చాలా కాలంగా ప్రభాస్ పెళ్లి అన్నది వార్తల్లోనే వుంటూ వస్తోంది. ఓ దశలో ఓ సినిమా హీరోయిన్ ను వివాహం చేసుకుంటారని గ్యాసిప్ లు బలంగా వినిపించాయి. కానీ అదీ రాంగ్ అని తేలిపోయింది. చూడాలి..ఈ జ్యోతిష్యుడి జోస్యం ఎంత వరకు ఫలిస్తుందో.