పార్టీలు ఇస్తున్న దర్శకుడు

సినిమా డైరెక్ట్ చేసే చాన్స్ రావడం అంటేనే అద్భుతం. అందులో పెద్ద హీరోను డైరక్ట్ చేసే చాన్స్ అంటే పరమాద్భుతం. అది కూడా ఓ ఫ్లాప్ సినిమా ఇచ్చి మళ్లీ మెగాఫోన్ పట్టుకోని స్టేజ్…

సినిమా డైరెక్ట్ చేసే చాన్స్ రావడం అంటేనే అద్భుతం. అందులో పెద్ద హీరోను డైరక్ట్ చేసే చాన్స్ అంటే పరమాద్భుతం. అది కూడా ఓ ఫ్లాప్ సినిమా ఇచ్చి మళ్లీ మెగాఫోన్ పట్టుకోని స్టేజ్ లో వున్నపుడు పెద్ద హీరోను డైరెక్ట్ చేసే చాన్స్ వస్తే అది దాదాపు భగవంతుడు ప్రత్యక్షం అయిపోయినట్లే. 

అందుకే ఓ దర్శకుడు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడట. గతంలో ఓ సినిమా చేసి, అది సరిగ్గా ఆడగ సైలంట్ గా తన పని తాను చేసుకుంటున్న ఈ దర్శకుడు ఇటీవల కాస్త లైమ్ లైట్ లోకి వచ్చారు. 

ఇదే సమయంలో ఓ పెద్ద హీరోకు కాస్త దగ్గర కావడం, ఆ చనువుతో ఇటీవల లైన్ చెప్పడం, బాగానే వుంది, డెవలప్ చేస్తే వింటా అని చెప్పడం జ‌రిగిపోయాయి. దీంతో ఇప్పుడు ఆ డైరక్టర్ క్లౌడ్ 9 లో తేలిపోతున్నాడట. 

ఇంకేం వుంది. పెద్ద సినిమా చేతిలో పడిపోయినట్లే అని తన మిత్ర బృందానికి పార్టీల మీద పార్టీలు ఇచ్చేస్తున్నాడట. అది కూడా మామూలుగా కాదు. చాలా కాస్ట్లీ లిక్కర్ బ్రాండ్ లు తెప్పించి మరీ పార్టీలు చేస్తున్నాడట.

ఈ ఊపులో సినిమా స్టార్ట్ అయిపోతే ఫరవాలేదు. ఖర్చులు కిట్టుబాటు అయిపోతాయి. లేదూ అంటే అనవసరం చేతి చమురు వదిలిపోయయినట్లు అవుతుంది.