బ‌ల‌హీన‌త‌ల‌పై బ్యూటీ ముద్దుముద్దు మాట‌లు

శృతిహాస‌న్‌… విల‌క్ష‌ణ అగ్ర‌హీరో క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తె. తండ్రి న‌ట‌నా వార‌స‌త్వాన్ని స్వీక‌రించారీ అందాల తార‌. అయితే సినీ రంగంలో ఎంట్రీకి మాత్ర‌మే తండ్రి ప‌లుకుబ‌డిని ఆమె వాడుకున్నారు. ఆ త‌ర్వాత న‌ట‌న‌లో ప్ర‌తిభ‌తో ఉనికి…

శృతిహాస‌న్‌… విల‌క్ష‌ణ అగ్ర‌హీరో క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తె. తండ్రి న‌ట‌నా వార‌స‌త్వాన్ని స్వీక‌రించారీ అందాల తార‌. అయితే సినీ రంగంలో ఎంట్రీకి మాత్ర‌మే తండ్రి ప‌లుకుబ‌డిని ఆమె వాడుకున్నారు. ఆ త‌ర్వాత న‌ట‌న‌లో ప్ర‌తిభ‌తో ఉనికి చాటుకున్నారు. 

ఇవాళ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. న‌ట‌న‌తో పాటు ముక్కుసూటిత‌నంతో మాట్లాడ్డం కూడా శృతిహాస‌న్‌కు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చింది. తాజాగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న‌వైన భావాల‌ను ఆమె వ్య‌క్తీక‌రించారు.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘సలార్’లో నటిస్తున్న శృతిహాస‌న్ అభిప్రాయాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ సంద‌ర్భంగా త‌నలోని బ‌ల‌హీన‌త‌ల‌ను ప్ర‌ద‌ర్శించే తీరును ఆమె ఆవిష్క‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కూ ఆమె ఏమ‌న్నారంటే…

‘ఆడ‌, మ‌గ అనే విష‌యాల‌తో సంబంధం లేదు. మనలో బలహీనతలు ఉన్నప్పుడు వాటిని బయటికి చెప్పాలి. అది హాస్యం అనే ఆయుధం ధరించి లేదా దాన్ని బలంగా చూపించాలి. ఈ విషయంలో మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. నా బలహీనతల విష‌యానికి వ‌స్తే చెప్పుకోడానికి ఏ మాత్రం వెనుకాడ‌ను.  

నా సంగీతం లేదా నా రచనల ద్వారా బ‌ల‌హీన‌త‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తాను. అది ఎవరికీ అర్థం అవ్వాల్సిన పని లేదు. ఇలా చాలా కాలంగా చేస్తున్నాను. చాలామంది జనాలు ఇలాగే చేస్తారని నాకు తెలుసు. ఈ తేడా గుర్తించడానికి నాకు 30 ఏళ్లు పట్టింది. ఇప్పుడు మాత్రం నాలో ఉన్న భయాలు, లోపాలను బలాలుగా భావిస్తున్నా’ అని ముద్దుగుమ్మ ముద్దుముద్దుగా చెప్పారు.