పండగ పూట ఇంత పెద్ద సినిమా ఓకేనా..?

సినిమాకు పెద్ద డ్యూరేషన్ అనేది కత్తికి రెండు వైపుల ఉన్న పదును లాంటిది. బాగుంటే ఓకే, సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఏమాత్రం తేడా కొట్టినా, భారీ నిడివి కారణంగా మొదటికే మోసం వచ్చే ప్రమాదం…

సినిమాకు పెద్ద డ్యూరేషన్ అనేది కత్తికి రెండు వైపుల ఉన్న పదును లాంటిది. బాగుంటే ఓకే, సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఏమాత్రం తేడా కొట్టినా, భారీ నిడివి కారణంగా మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరీ ముఖ్యంగా పండగ పూట థియేటర్లలోకి వచ్చే సినిమాల్లో పెద్ద రన్ టైమ్ అనేది మరింత రిస్క్ తో కూడిన విషయం.

ఇప్పటికే ఎన్నో రిస్క్ లు ఫేస్ చేస్తోంది టైగర్ నాగేశ్వరరావు సినిమా. ఇప్పుడీ సినిమా నిడివి విషయంలో కూడా అదే రిస్క్ ఫ్యాక్టర్ ను ఫాలో అవుతోంది. దసరా బరిలో భారీ రన్ టైమ్ తో వస్తున్న సినిమా ఇదొక్కటే.

భగవంత్ కేసరి సినిమా 155 నిమిషాలుంది. ఇది పెర్ ఫెక్ట్ రన్ టైమ్. ఇక డబ్బింగ్ మూవీ లియో కాస్త ఎక్కువగా 164 నిమిషాలుంది. కంటెంట్ బాగుంటే, ఈమాత్రం అదనపు నిడివిని భరించడం పెద్ద విషయం కాదు. కానీ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఏకంగా 181 నిమిషాలుంది. అంటే, 3 గంటలన్నమాట.

తెలుగు ఆడియన్స్ కు 3 గంటల సినిమాలు కొత్తకాదు, అలా భారీ నిడివితో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. మహానటి, అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను.. ఆ మాటకొస్తే సంక్రాతి బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కూడా సగటు రన్ టైమ్ కంటే 10-15 నిమిషాలు అదనపు నిడివితోనే వచ్చాయి. ఈ లిస్ట్ లో సరిలేరు నీకెవ్వరు, కేజీఎఫ్2ను కూడా చెప్పుకోవచ్చు.

అదే టైమ్ లో సంక్రాంతికొచ్చిన వారసుడు సినిమా 2 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజైంది. ఈ సినిమా రిజల్ట్ సంగతి తెలిసిందే. ఇక ఆదిపురుష్, అంటే సుందరానికి సినిమాల నిడివి కూడా ఎక్కువే.

ఇలా సినిమాల రిజల్ట్ డిసైడ్ చేసే అంశాల్లో రన్ టైమ్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సో.. దసరా బరిలో భారీ రన్ టైమ్ తో వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ఏ కోవలోకి చేరుతుందో, మరో వారం రోజుల్లో తేలిపోతుంది.