దేవరకొండ రెడీ అవుతున్నాడు

సంక్రాంతి విడుదలల విషయంలో ఎవరికి వారే తగ్గేదే లే అంటూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే వర్క్ పూర్తి చేసుకుని రెడీ గా వున్న ఈగిల్, హనుమాన్, సైంధవ్ సంక్రాంతికే అంటూ వుంటే షూటింగ్ లో…

సంక్రాంతి విడుదలల విషయంలో ఎవరికి వారే తగ్గేదే లే అంటూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే వర్క్ పూర్తి చేసుకుని రెడీ గా వున్న ఈగిల్, హనుమాన్, సైంధవ్ సంక్రాంతికే అంటూ వుంటే షూటింగ్ లో గుంటూరుకారం కూడా అదే దారిలో వుంది. 

విజయ్ దేవరకొండ-పరుశురామ్ సినిమా కూడా సంక్రాంతికే అని ఇప్పటికే ప్రకటించారు. కానీ వస్తుందా.. రాదా అన్న అనుమానాలు వున్నాయి. అయితే ఈ సినిమా వర్క్ మహా అయితే మరో ముఫై రోజులే వుందని, సంక్రాంతికి విడుదల ఫిక్స్ అని తెలుస్తోంది.

ఈ నెల 18న సినిమా గ్లింప్స్ విడుదల చేస్తారట. కేవలం విడుదల చేయడమే కాకుండా రెండు రాష్ట్రాల్లోని థియేటర్లలో కూడా విడుదల చేస్తారట. ఆ టైమ్ లోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆ విధంగా సంక్రాంంతికే వస్తున్నామని మరోసారి పక్కాగా చెబుతారట.

అంటే సంక్రాంతికి రుమాళ్లు వేసిన సినిమాల సంఖ్య అయిదుకు పెరుగుతుంది. షూటింగ్ చేసుకుంటూ, సంక్రాంతికే అని చెప్పిన నాగార్జున సినిమా కూడా వుండనే వుంది. దాని సంగతేమిటో మరి. తన సినిమా పబ్లిసిటీ కంటెంట్ బయటకు వచ్చే వరకు ఇలా డేట్ లు వేస్తూనే వుంటారని, వన్స్ తమ కంటెంట్ చూసాక, డ్రాప్ అయ్యేవారు అవుతారని గుంటూరు కారం టీమ్ ధీమాగా వుంది.