పూర్తిగా ట్రాక్ తప్పిన ‘నకిలీ’ సాబ్

దేశంలో ఏ మతం గొప్పది అంటే కచ్చితంగా హిందూ మతమేనని చెబుతారు బీజేపీ నాయకులు. కనీసం పరమత సహనం, ఇతర మతాలను గౌరవించడం అనేవి ఏ కోశానా వారిలో కనిపించవు.  Advertisement హిందూత్వం అనే…

దేశంలో ఏ మతం గొప్పది అంటే కచ్చితంగా హిందూ మతమేనని చెబుతారు బీజేపీ నాయకులు. కనీసం పరమత సహనం, ఇతర మతాలను గౌరవించడం అనేవి ఏ కోశానా వారిలో కనిపించవు. 

హిందూత్వం అనే పేరుతో రాజకీయాలు చేయడానికి ఏమాత్రం మొహమాట పడరు ఆ పార్టీ నేతలు. కానీ మిగతా పార్టీలు అలా కాదు. అందులోనూ ఏపీలో మతతత్వ రాజకీయాలకు చోటే లేదు.

కులాల వారీగా ఓట్లు చీల్చాలని చూసినా అది విమర్శల కోసమే కానీ, వాస్తవంలో సాధ్యమయ్యే పనే కాదు. ఇక పవన్ కల్యాణ్ విషయానికొస్తే.. తనది రెల్లి కులం అని, తనది సర్వమత సమ్మేళనం అని గతంలో చెప్పేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా బీజేపీ ట్రాప్ లో పడిపోయారు. 

కమలానికి ఉన్న బురదనంతా తన ఒంటికి పూసుకుంటున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై సీబీఐ ఎంక్వయిరీ కోరడం వరకు పర్లేదు. అక్కడితో ఆగకుండా.. తిరుమల కొండపై నుంచి మంత్రులు సీఎం జగన్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పారంటూ పెడర్ధాలు తీయడమే మరీ విడ్డూరం. 

ఈపాటికే ఇలాంటి విమర్శలు చేసి బీజేపీ నేతలు తమ కుంచిత మనస్తత్వాన్ని బైట పెట్టుకున్నారు. కాస్త లేటుగా అయినా లేటెస్ట్ గా ఈ వ్యాఖ్యలు చేసి పవన్ కల్యాణ్ కూడా తన చీప్ మెంటాలిటీని వ్యక్తపరిచారు.

ఇన్నాళ్లూ కులమతాలకు అతీతంగా పవన్ ని అభిమానించినవారు సైతం.. ఇప్పుడు జనసేనానిని ఛీ కొడుతున్నారు. తిరుమల కొండపై నిలబడి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడంలో పవన్ కి ఏం తప్పు కనిపించిందని అడుగుతున్నారు. 

జానీ సినిమాలో  పరమత సహనం బోధిస్తూ పాట పెట్టుకున్న పవన్ కి, ఇప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తూ, బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కి చాలా తేడా ఉందని గుర్తు చేసుకుంటున్నారు.

ఏ కులం, లేదా ఏ మతం వాళ్లు సినిమా చూస్తే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు, అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చిన తమ్ముడు.. ఏ కులం-మతం ఆధారంగా పవర్ స్టార్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక, అందులోనూ బీజేపీతో మరీ రాసుకుపూసుకు తిరుగుతున్న టైమ్ లో పవన్ కి ఇంతలా మత మౌఢ్యం పట్టుకుందా అని విమర్శిస్తున్నారు నెటిజన్లు.

తన వ్యవహార శైలితో ఇప్పటికే చాలామందిని దూరం చేసుకున్న పవన్, మతపరమైన సంకుచిత మనస్తత్వాన్ని పూర్తిస్థాయిలో బైటపెట్టుకుంటూ మరింత దిగజారిపోతున్నారు. చంద్రబాబుతో చేరినన్ని రోజులు వ్యక్తిగతంగా పతనం అయిన పవన్, ఇప్పుడు బీజేపీతో అంటకాగుతూ.. నైతికంగా కూడా పతనం అంచుకు చేరుకుంటున్నారు.

ఇకనైనా ఇలాంటి నీఛ రాజకీయాలు మానుకుంటే కనీసం పవన్ ని ఓ సినిమా స్టార్ గా అయినా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. మతాల వారీగా జనాల్ని విభజిస్తే మాత్రం.. జనసేనాని, మత సేనానిగా మారిపోవడం ఖాయం.అందుకే వకీల్ సాబ్ ను నకిలీ సాబ్ అనడంలో తప్పు లేదనిపిస్తుంది.

ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క