ఈ సినిమాని జనాలు పట్టించుకుంటారా?

లాక్ డౌన్ వల్ల ఓటీటీకి డిమాండ్ పెరిగింది. దీంతో రొటీన్ గా వెళ్లే తెలుగు మూవీ మేకర్స్ కూడా కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. సరికొత్త కాన్సెప్టుల్ని ఆవిష్కరించారు. ఈ లాక్ డౌన్ టైమ్ లో…

లాక్ డౌన్ వల్ల ఓటీటీకి డిమాండ్ పెరిగింది. దీంతో రొటీన్ గా వెళ్లే తెలుగు మూవీ మేకర్స్ కూడా కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. సరికొత్త కాన్సెప్టుల్ని ఆవిష్కరించారు. ఈ లాక్ డౌన్ టైమ్ లో కొత్త కాన్సెప్టులతో చాలా సినిమాలొచ్చాయి. 

ఇప్పటివరకు తెలుగులో అలాంటి కథల్ని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. అలాంటిదే ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది. దాని పేరు 'విటమిన్-షీ'.

రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా కథ, అందులో డీల్ చేసిన అంశాలు చాలా కొత్తగా ఉన్నాయి. మనిషి-యంత్రం ప్రేమలో పడడం మనం ఆల్రెడీ చూశాం. 

రోబో సినిమాలో మరమనిషి, హీరోయిన్ తో ప్రేమలో పడుతుంది. ఈ 'విటమిన్-షీ' లో వాయిస్ అసిస్టెంట్, హీరోతో ప్రేమలో పడుతుంది. అంతేకాదు.. హీరోహీరోయిన్ల మధ్య బ్రేకప్ అయ్యేలా చేస్తుంది. 

ఇదొక యాంగిల్ అనుకుంటే.. కరోనా వైరస్ పుట్టుక వెనక ఓ కుట్ర దాగుందేమో అనే అనుమానాన్ని రేకెత్తించేలా ఈ సినిమాలో కొన్ని అంశాల్ని టచ్ చేయడం గమ్మత్తుగా అనిపిస్తుంది. 

'లైఫ్ 3.O' అనే పుస్తకం నుంచి ప్రేరణపొంది దర్శకుడు ఈ సన్నివేశాలు రాసుకున్నట్టున్నాడు. మొత్తంగా చూసుకుంటే.. గంటకు అటుఇటుగా ఉన్న ఈ సినిమా చూస్తే ఓ కొత్త అనుభూతి మాత్రం కలుగుతుంది.

ఈ సినిమాను జయశంకర్ అనే వ్యక్తి డైరక్ట్ చేశాడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ ఇతడే. గతంలో ఇతడు పేపర్ బాయ్ అనే సినిమా తీశాడు. 

అలాంటి ఫీల్ గుడ్ మూవీ తర్వాత ఇలాంటి టెక్నాలజీ బేస్డ్ డిఫరెంట్ స్టోరీని సెలక్ట్ చేసుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన విటమిన్-షీ కాన్సెప్ట్ పరంగా బాగున్నప్పటికీ.. ఆడియన్స్ కు ఏ రేంజ్ లో రీచ్ అవుతుందో చూడాలి.

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క

ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు