టెన్షన్.. తెలంగాణలో ప్రవేశించిన కొత్త రకం కరోనా

ఇన్నాళ్లూ ఆనోటా ఈనోట వినిపిస్తూ భయపెట్టిన కొత్త కరోనా వైరస్ (యూకే వైరస్ లేదా కరోనా స్ట్రెయిన్) తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తోంది. ఆల్రెడీ తెలంగాణలో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రవేశించగా.. ఆంధ్రప్రదేశ్ లో…

ఇన్నాళ్లూ ఆనోటా ఈనోట వినిపిస్తూ భయపెట్టిన కొత్త కరోనా వైరస్ (యూకే వైరస్ లేదా కరోనా స్ట్రెయిన్) తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తోంది. ఆల్రెడీ తెలంగాణలో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రవేశించగా.. ఆంధ్రప్రదేశ్ లో మరింత టెన్షన్ నెలకొంది.

తెలంగాణలో కరోనా స్ట్రెయిన్ ను గుర్తించారు. కాకపోతే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బ్రిటన్ నుంచి వరంగల్ వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ సోకినట్టు సీసీఎంబీ నిర్థారించింది. అయితే ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. కేంద్రానికి మాత్రం నివేదిక పంపించింది.

ఈనెల 10న ఈ వ్యక్తి యూకే నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లాడు. ఇతడికి కొత్తరకం కరోనా వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఈయన తల్లికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ఇతర కుటుంబ సభ్యులందరికీ నెగెటివ్ వచ్చింది. వరంగల్ వచ్చినప్పట్నుంచి ఇతడు ఎవరెవర్ని కలిశాడనే అంశంపై ఆరా తీస్తున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా స్ట్రెయిన్ టెన్షన్ ఎక్కువైంది. యూకే నుంచి ఏపీకి ఇప్పటివరకు 1363 మంది వచ్చారు. వీళ్లలో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీళ్లలో ఎంతమంది కొత్త రకం కరోనా బాధితులు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనికితోడు యూకే నుంచి ఏపీకి వచ్చిన వాళ్లలో

ఇంకా 17 మంది ఆచూకీ దొరక్కపోవడం  ఇప్పుడు మరింత టెన్షన్ కు దారితీస్తోంది. పాజిటివ్ వచ్చిన వాళ్లలో అనంతపురం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వాళ్లు ఉన్నారు.

సాధారణ కరోనా కంటే కొత్తరకం కరోనాకు 70శాతం వేగంగా వ్యాపించే లక్షణం ఉంది. పైగా మ్యూటేటెడ్ వెర్షన్ కావడం వల్ల లక్షణాల్లో కూడా తేడాలు ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. 

మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ వార్ణింగ్ ఇస్తున్నాడు