ప్రీ సమ్మర్ రేస్ లో చెక్

నితిన్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో తయారవుతున్న విభిన్న చిత్రం చెక్.  Advertisement యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తయారవుతున్న సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. మరో…

నితిన్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో తయారవుతున్న విభిన్న చిత్రం చెక్. 

యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తయారవుతున్న సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. మరో రెండు వారాల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని, విడుదలకు రెడీ అవుతుంది.

అయితే విడుదల మాత్రం కాస్త లేటు అయ్యే అవకాశం వుంది. ఎందుకంటే నితిన్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో తయారైన రంగ్ దే సినిమా కూడా విడుదలకు రెడీగా వుంది. 

చెక్, రంగ్ దే రెండింటిలో ఏది ముందు? ఏది వెనుక? అన్నది ఇంకా డిసైడ్ కావాలి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రంగ్ దే కనుక విడుదలైతే మార్చిలో చెక్ కు డేట్ ఫిక్స్ కావచ్చు.

చెక్ సినిమా కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కింది. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఓ జైలుసెట్ నిర్మించారు. సినిమా అధిక భాగం ఈ జైలు సెట్ లోనే షూట్ చేసారు.

మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ వార్ణింగ్ ఇస్తున్నాడు