పవన్ – రెండు ఫ్లాష్ బ్యాక్ లు

తమిళ, మలయాళ సినిమాల వ్యవహారం వేరు. మన సినిమాల సంగతి వేరు. మన ఫ్యాన్స్ టేస్ట్ వేరు. ఎలాంటి సినిమా అయినా, కథ అయినా పెద్ద హీరోలు చేస్తున్నారు అంటే యాడెడ్ మసాలా వుండాల్సిందే. …

తమిళ, మలయాళ సినిమాల వ్యవహారం వేరు. మన సినిమాల సంగతి వేరు. మన ఫ్యాన్స్ టేస్ట్ వేరు. ఎలాంటి సినిమా అయినా, కథ అయినా పెద్ద హీరోలు చేస్తున్నారు అంటే యాడెడ్ మసాలా వుండాల్సిందే. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రీమేక్ లు చేస్తున్నారు. వకీల్ సాబ్ గా పింక్ రీమేక్, మలయాళ సినిమా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్. ఈ రెండు సినిమాల్లో ఫ్యాన్స్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నట్లు బోగట్టా.

పింక్ రీమేక్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిడివి పెంచుతున్నారు. ఫ్యాన్స్ కు కావాల్సిన సరుకు అంతా అక్కడ వుంటుందన్నమాట. ఇదిలా వుంటే అయ్యప్పన్ లో వాస్తవానికి ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ లేదు.

కానీ కథలో కీలకమైన మలుపు, ట్విస్ట్ ను ప్లాన్ చేసారు. దాని కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను యాడ్ చేసారు. అయితే ఏదో యాడ్ చేసాం అన్నట్లు కాకుండా, అది ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గా వుండేలా ఓ చమక్కు ప్లాన్ చేసారు.

ఈ చమక్కు కోసం గ్రాఫిక్స్, సిజి వర్క్ కూడా వాడబోతున్నారు. సినిమా షూట్ ప్రారంభించడమే ఈ ఎపిసోడ్ తో ప్రారంభిస్తారు. ఆ తరువాత పోలాచ్చి వెళ్లి సింగిల్ షెడ్యూలులో పూర్తి చేస్తారు. ఈ రెండు సినిమాలు కాకుండా క్రిష్ డైరక్షన్ లో ఓ సినిమా షూటింగ్ దశలో వున్న సంగతి తెలిసిందే.

అరియ‌నా ట్రోఫీ గెలుస్తుంద‌ని ఎదురుచూసా