వెంకీ పై ఫాల్స్ గ్యాసిప్ ?

ఒకేఒక్క సినిమాకు పని చేసాడు వెంకీ కుడుముల దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర. మరెవరు త్రివిక్రమ్ శిష్యులం రాకపోవడం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు.  Advertisement మొత్తానికి త్రివిక్రమ్ శిష్యుడిగా ముద్ర వేసేసింది వెంకీ కుడుమలకు…

ఒకేఒక్క సినిమాకు పని చేసాడు వెంకీ కుడుముల దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర. మరెవరు త్రివిక్రమ్ శిష్యులం రాకపోవడం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు. 

మొత్తానికి త్రివిక్రమ్ శిష్యుడిగా ముద్ర వేసేసింది వెంకీ కుడుమలకు మన మీడియా. సరే ఆ సంగతి అలా వుంచితే వెంకీ కుడుమల తరువాత ప్రాజెక్టు అయితే మైత్రీ లో లేదూ అంటే పాత అడ్వాన్స్ వున్న యువిలో. 

పైగా జనాలకు తెలియని విషయం ఏమిటంటే వెంకీ కుడుమలకు భీష్మ సినిమా యూనిట్ కు మధ్య దూరం బాగా అంటే బాగా పెరిగిందని. 

ఇదిలా వుంటే మహేష్ తొ సినిమా కోసం కొంత ప్రయత్నాలు వెంకీ కుడుమల వైపు నుంచి జరిగాయి. కానీ అవి ప్రస్తుతానికి అబేయన్స్ లో పడ్డాయి. దానికి బదులు హీరో రామ్ తో సినిమా అన్నది కార్డ్స్ మీదకు వచ్చింది.

ఇక్కడే మీడియా ఓ ఫాల్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. త్రివిక్రమ్ ఇచ్చే కథతో, రామ్ హీరోగా వెంకీ కుడుమల సినిమా అంటూ. పైగా అది కూడా సితార యూనిట్ లో అంటూ. 

ఇక్కడ రెండూ జరిగే విషయాలు కాదు. ఒకటి త్రివిక్రమ్ తన కథను వెంకీ కుడుమలకు ఇవ్వడం. రెండు సితారలో సినిమా ఇప్పట్లో వుండడం. పాపం, ఈ గ్యాసిప్ లు చదివినా, ఖండించలేకపోతున్నట్లుంది వెంకీ కుడుమల. ఎందుకంటే త్రివిక్రమ్ శిష్యుడు అన్న టాగ్ లైన్ బానే వుంటుంది కదా ఎవరికైనా.

అరియ‌నా ట్రోఫీ గెలుస్తుంద‌ని ఎదురుచూసా