కరోనా కూడా మంచిదే

కరోనా వచ్చింది. టాలీవుడ్ అతలాకుతలం అయిపోయింది. కానీ పోస్ట్ కరోనా సీన్ చూస్తుంటే కరోనా కూడా మంచిదే అనిపిస్తోంది. ఇవాళ టాలీవుడ్ లో చిత్రమైన సీన్ కనిపిస్తోంది.  Advertisement ఒకరిద్దరు తప్పించి, టాప్ టు…

కరోనా వచ్చింది. టాలీవుడ్ అతలాకుతలం అయిపోయింది. కానీ పోస్ట్ కరోనా సీన్ చూస్తుంటే కరోనా కూడా మంచిదే అనిపిస్తోంది. ఇవాళ టాలీవుడ్ లో చిత్రమైన సీన్ కనిపిస్తోంది. 

ఒకరిద్దరు తప్పించి, టాప్ టు బాటమ్ ప్రతి హీరో చేతిలో మూడు నాలుగు సినిమాలు వున్నాయి. ఇక అయిపోయింది. వ్యవహారం షెడ్ కే అనుకున్న హీరోలు, నటులు కూడా ఇవాళ ఫుల్ బిజీ అయిపోయారు. ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోజుకు ఒకటి కి రెండుచోట్ల పని చేయాల్సి వస్తోంది.

నారా రోహిత్, నందమూరి తారకరత్నల పేర్లు వినిపించడం తక్కువగా వుంది కానీ, మిగిలిన ప్రతి సినిమా నటుడు చేతి నిండా సినిమాలతో కిందామీదా అవుతున్నారు. 

ఈ మధ్య ఒకే రోజు 83 తెలుగు సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయని టాక్. దీనివల్ల టెక్నికల్ ఎక్విప్ మెంట్ కూడా దొరకకుండా పోతోందట.

ఒక రోజు కొన్ని సినిమాలకు ఓ చిన్న క్రేన్ కావాలి, ఒక చిన్న ట్రాలీ కావాలి అన్నా దొరకలేదట.  ఎక్విప్ మెంట్ దొరక్క వెంకటేష్ నారప్ప సినిమా షూట్ ఓ రోజు అర్థాంతరంగా వాయిదా పడిందని తెలుస్తోంది. 

దీని ఫలితంగా 2021 లో సినిమాల విడుదల ఓ రేంజ్ లో వుంటుందని, అస్సలు రిలీజ్ డేట్ లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సమ్మర్ లో సినిమాలు భయంకరంగా పోటీ పడే పరిస్థితి కనిపిస్తోంది.

అరియ‌నా ట్రోఫీ గెలుస్తుంద‌ని ఎదురుచూసా