ఈనాడు కడుపుమంట మరి ఇంత నీచంగానా?

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అయితే మాట ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఢిల్లీ ఏలు బడిలో ఉండి ఉంటే.. పరిస్థితి…

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అయితే మాట ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఢిల్లీ ఏలు బడిలో ఉండి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు గానీ.. విభజన తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు అనేక విషయాలలో మాట తప్పింది. 

ఆ కడుపు మంట మొత్తం పెట్టినా.. ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేసే వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకపోవడం రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసిందని చెప్పాలి. 2014 -15 సంవత్సరాలకు సంబంధించిన ఏపీ రెవెన్యూ లోటు మొత్తం సుమారు పదివేల కోట్ల పైచిలుకు నిధులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కు విడుదల చేసింది. 

విభజన తర్వాత కేంద్రం నుంచి రావలసిన నిధుల విషయంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం ఇదే ప్రథమం. అయితే రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న కేంద్రానిధులు వచ్చినందుకు ఏదో ఒక పని జరుగుతుంది అభివృద్ధి మందగించకుండా ముందుకు సాగుతుంది అని సాధారణంగా అందరూ సంతోషించాలి. ఈనాడు దినపత్రిక మాత్రం ఈ నిధులు రావడానికి చూసి ఓర్వలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంది.

‘‘ఏపీపై డబ్బుల వాన’’ అనే శీర్షికతో ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. ‘అప్పుల ఊబిలో కూరుకుపోతూ రోజు గడవడమే కష్టంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం కరుణ చూపించిందనేది’ ఈ వార్త సారాంశం. ఇంతకూ విషయం ఏంటంటే.. 2014-15 సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద ‘ప్రత్యేక ఆర్థిక సాయం’గా కేంద్రం ఏపీకి రూ.10,461 కోట్లు మంజూరుచేసింది. ఆ నిధులు విడుదల కాబోతున్నాయి. 

జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది, వెతుకులాట లేకుండా, నిధులు అందుబాటులోకి వస్తున్నాయని ఈనాడు ఏడుస్తోంది. ‘గత ప్రభుత్వం (అంటే చంద్రబాబు ప్రభుత్వం) అయిదేళ్లు గింజుకున్నా విదల్చని కేంద్రం’ అంటూ ఈనాడు తన ఏడుపును, ఆక్రోశాన్ని దాచుకోకుండా బయటపెట్టింది. చంద్రబాబు ఉన్నప్పుడు ఆ నిధులు రాలేదని, జగన్ పాలనలో వచ్చాయని వారి ఏడుపు అన్నమాట.

ఇంతమైన నీచమైన జర్నలిజం ప్రమాణాలకు ఈనాడు ఎందుకు దిగజారుతున్నదో తెలియదు. నిజంగా ఇలాంటి పరిణామం జరిగినప్పుడు.. ‘ఏపీ సర్కారుకు ఊరట- కేంద్రం నుంచి పెండింగ్ నిధుల విడుదల’ వంటి హెడింగు రావాలి. విషం నిండని, నిజాయితీ గల జర్నలిజం అంటే అది మాత్రమే. ఇంకా అందులో కొంత తమ పచ్చపైత్యం జోడించి.. చంద్రబాబు భజన చేయాలని కోరుకుంటే గనుక.. ‘‘అయిదేళ్లపాటు చంద్రబాబునాయుడు సుదీర్ఘ విన్నపాలకు ఇన్నాళ్లకు మోక్షం లభించింది’’ అని రాసుకోవచ్చు.

అలాంటిదేమీ లేకుండా ‘‘ఎన్నికల ఏడాదిలో జగన్ సర్కారుకు భారీ ఊరట’’ అంటూ ఈనాడు విలపించడం హేయం. అక్కడికేదో ఆ డబ్బులన్నీ ఎన్నికలకోసం జగన్ జనానికి పంచిపెట్టే నిధుల్లాగా వార్తలో వ్యాఖ్యలను జోడించడం వారి బుద్ధి ఎంతగా పతనం అయిపోతున్నదో తెలుసుకోవడానికి నిదర్శనం అని ప్రజలు విమర్శిస్తున్నారు.