అవినాష్ ను వేటాడుతున్న మీడియా

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే. ఈ సంకల్పం సిబిఐ కన్నా తేదేపా అను’కుల’ మీడియాకే ఎక్కువగా కనిపిస్తోంది. మా కుల గురువును మీరు ఇబ్బంది పెడతారా? మీ కులపోడి సంగతి మేము చూడమా? అనేట్లు…

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే. ఈ సంకల్పం సిబిఐ కన్నా తేదేపా అను’కుల’ మీడియాకే ఎక్కువగా కనిపిస్తోంది. మా కుల గురువును మీరు ఇబ్బంది పెడతారా? మీ కులపోడి సంగతి మేము చూడమా? అనేట్లు వ్యవహరిస్తున్నారు. కానీ ఇదే మీడియా అసలు సిబిఐ ను రాష్ట్రంలో అనుమతించము అన్న వారి గురించి గుర్తు పెట్టుకోనేలేదు. సిబిఐ రాష్ట్రంలోకి రాకూడదు అనడం బెటర్ గా కనిపిస్తోంది సదరు మీడియాకు.

నిన్న మొన్నటి వరకు అవినాష్ నే వివేకా హత్య కేసులో దోషి అన్న కలర్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ అరెస్ట్ నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నించడంతో అతనే దోషి అని డిసైడ్ చేసేసారు. ఈ మేరకు ఆ పార్టీ అను’కుల’ సోషల్ మీడియా హ్యాండిల్స్, రెగ్యులర్ మీడియా, డిజిటల్ మీడియా ఇలా అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి చేస్తున్నాయి.

ఆంధ్రలో ఏదో జరిగిపోతొంది. అంతా తల్లకిందలైపోతోంది. సర్వనాశనం అయిపోతోంది అన్న కలర్ ఇవ్వడానికి తెగ తాపత్రయపడిపోతున్నాయి. కానీ కామన్ మాన్ ఆలోచన ఇలా వుండదని అర్థం చేసుకోవడం లేదు. 

కడపలో ఏదో గడబిడ అవుతుంటే శ్రీకాకుళం జిల్లాలో పల్లె ఓటరకు ఎందుకు పడుతుంది. తనకు ప్రభుత్వం ఏమి ఇచ్చిందన్నది ఫస్ట్ క్వశ్చను. తమ ఊరిలో ఏం జరుగుతోందన్నది రెండో క్వశ్చను. ఈ రెండిటినీ సక్రమంగా చూసుకున్న ఏ ప్రభుత్వం మరే వ్యవహారాలు ఎలా చేసినా ఓటర్ కు పట్టదు.

కానీ పట్టణ ఓటరును, న్యూట్రల్ ఓటరును ప్రభావితం చేసి, తెలుగుదేశం వైపు మళ్లించడానికి ఈ తెలుగుదేశం అనుకుల మీడియా కిందా మీదా అయిపోతోంది. పైగా తమ దారిలోకి రాని మిగిలిన మీడియాను కూడా తనలాగే అనుకుని బ్లూ మీడియా అంటూ ముద్ర వేస్తోంది. అంటే తమ దారిలోకి రావాలి లేదా బురద జల్లించుకోవాలి. ఇదే ఈ తేదేపా అనుకుల మీడియా తీరు.