కరోనా వల్ల థియేటర్లు తెరిస్తే ఎలా ఉంటుంది? ఆడియన్స్ వస్తారా రారా? 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తాయా? ఇలాంటి అనుమానాలన్నింటికీ చెక్ పెట్టింది సోలో బ్రతుకే సో బెటర్. సాయితేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి.
మొదటి రోజు ఏపీ, నైజాంలో 4 కోట్ల 70 లక్షల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజు 3 కోట్ల 29 లక్షల రూపాయల గ్రాస్ సాధించింది. అక్కడక్కడ మిక్స్ డ్ టాక్ రావడంతో.. రెండో రోజు వసూళ్లు తగ్గుతాయని ట్రేడ్ భావించింది. కానీ ఆ తగ్గుదల స్వల్పం మాత్రమే.
అలా 2 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 99 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇదే ఊపు కొనసాగితే.. ఈ వీకెండ్ గడిచేసరికి చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఈ వసూళ్లు అంటే అది గొప్ప విషయమే.
ఏపీ, నైజాం 2వ రోజు గ్రాస్
నైజాం – 1.19 కోట్లు
సీడెడ్ – 0.59 కోట్లు
గుంటూరు – 0.26 కోట్లు
నెల్లూరు – 0.13 కోట్లు
కృష్ణా – 0.18 కోట్లు
వెస్ట్ – 0.15 కోట్లు
ఈస్ట్ – 0.24 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.55 కోట్లు
2వ రోజు మొత్తం గ్రాస్ – రూ. 3.29 కోట్లు
2 రోజుల మొత్తం గ్రాస్ – రూ. 7.99 కోట్లు