‘సోలో’ గా 2 రోజుల్లో రూ.7.99 కోట్లు

కరోనా వల్ల థియేటర్లు తెరిస్తే ఎలా ఉంటుంది? ఆడియన్స్ వస్తారా రారా? 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తాయా? ఇలాంటి అనుమానాలన్నింటికీ చెక్ పెట్టింది సోలో బ్రతుకే సో బెటర్. సాయితేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా…

కరోనా వల్ల థియేటర్లు తెరిస్తే ఎలా ఉంటుంది? ఆడియన్స్ వస్తారా రారా? 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తాయా? ఇలాంటి అనుమానాలన్నింటికీ చెక్ పెట్టింది సోలో బ్రతుకే సో బెటర్. సాయితేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి.

మొదటి రోజు ఏపీ, నైజాంలో 4 కోట్ల 70 లక్షల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజు 3 కోట్ల 29 లక్షల రూపాయల గ్రాస్ సాధించింది. అక్కడక్కడ మిక్స్ డ్ టాక్ రావడంతో.. రెండో రోజు వసూళ్లు తగ్గుతాయని ట్రేడ్ భావించింది. కానీ ఆ తగ్గుదల స్వల్పం మాత్రమే.

అలా 2 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 99 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇదే ఊపు కొనసాగితే.. ఈ వీకెండ్ గడిచేసరికి చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఈ వసూళ్లు అంటే అది గొప్ప విషయమే.

ఏపీ, నైజాం 2వ రోజు గ్రాస్
నైజాం – 1.19 కోట్లు
సీడెడ్ – 0.59 కోట్లు
గుంటూరు – 0.26 కోట్లు
నెల్లూరు – 0.13 కోట్లు
కృష్ణా – 0.18 కోట్లు
వెస్ట్ – 0.15 కోట్లు
ఈస్ట్ – 0.24 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.55 కోట్లు

2వ రోజు మొత్తం గ్రాస్ – రూ. 3.29 కోట్లు
2 రోజుల మొత్తం  గ్రాస్ – రూ. 7.99 కోట్లు 

జ‌గ‌న్ రికార్డ్ సృష్టించిన‌ట్లేనా..!