మళ్లీ సెట్స్ పైకి వచ్చిన పవన్ కల్యాణ్ సినిమా

చాలా రోజుల కిందటే బ్రో సినిమా షూటింగ్ పూర్తి చేశాడు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమాకు సంబంధించి పవన్ చేయాల్సిన పోర్షన్ ఇంకా పెండింగ్ ఉంది. ఈరోజు నుంచి ఈ సినిమా మళ్లీ…

చాలా రోజుల కిందటే బ్రో సినిమా షూటింగ్ పూర్తి చేశాడు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమాకు సంబంధించి పవన్ చేయాల్సిన పోర్షన్ ఇంకా పెండింగ్ ఉంది. ఈరోజు నుంచి ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. అయితే పవన్ ఇంకా జాయిన్ అవ్వలేదు.

బ్రో సినిమాకు ఈమధ్య గ్యాప్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ అటు ఓజీ సినిమా షూటింగ్ తో బిజీ అవ్వడం, సాయితేజ్ ఇటు విరూపాక్ష సినిమా ప్రమోషన్ తో బిజీ అవ్వడంతో.. బ్రో సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగింది.

ఇప్పుడు సాయితేజ్ ఫ్రీ అయ్యాడు. దీంతో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈరోజు షెడ్యూల్ లో సాయితేజ్ జాయిన్ అయ్యాడు. అతడిపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం భారీ పబ్ సెట్ వేశారు. ఆ సెట్ లో పవన్ కల్యాణ్, సాయితేజ్ పై ఓ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. పవన్ ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే, అప్పుడు ఈ సినిమా షూట్ మొదలవుతుంది.

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు హీరోయిన్ లేదు. సాయితేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న బ్రో సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను జులై 28న విడుదల చేయబోతున్నారు.