ఇనస్టాగ్రామ్ హ్యాక్ అవ్వలేదంట!

దేశవ్యాప్తంగా ఇనస్టాగ్రామ్ మొరాయించింది. వేలాది మంది తమ ఎకౌంట్స్ పనిచేయక ఇబ్బంది పడ్డారు. ఇనస్టాకు ఏదో అయిందంటూ ట్విట్టర్ లో ఎడతెగని పోస్టులు పడ్డాయి. అదే సమయంలో పుకార్లు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన…

దేశవ్యాప్తంగా ఇనస్టాగ్రామ్ మొరాయించింది. వేలాది మంది తమ ఎకౌంట్స్ పనిచేయక ఇబ్బంది పడ్డారు. ఇనస్టాకు ఏదో అయిందంటూ ట్విట్టర్ లో ఎడతెగని పోస్టులు పడ్డాయి. అదే సమయంలో పుకార్లు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ యాప్, హ్యాక్ అయిందంటూ కొందరు పుకార్లు పుట్టించారు.

అప్పటివరకు స్తబ్దుగా ఉన్న ఇనస్టాగ్రామ్, ఈ పుకార్లతో ఒక్కసారిగా అలెర్ట్ అయింది. తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ కు ఏం కాలేదని, కేవలం చిన్న సాంకేతిక సమస్య మాత్రమే తలెత్తిందని ప్రకటించింది. ఆ సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం ఇనస్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోందని ప్రకటించింది.

డౌన్ డిటెక్టర్.కామ్ అంచనా ప్రకారం.. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో ఇనస్టాగ్రామ్ అంతరాయాలు ఎక్కువగా కనిపించాయి. యూఎస్ లో దాదాపు లక్షమంది వరకు ఈ యాప్ బాధితులున్నారు. అటు కెనడాలో 24వేల మంది, బ్రిటన్ లో 56వేల మంది ఈ యాప్ ను వాడడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఇండియాలో అతి తక్కువగా 9500 మంది ఇనస్టా ఫీడ్ ను యాక్సెస్ చేయలేకపోయారు.

అంతర్జాతీయ కాలమానం ప్రకారం, ఉదయం 4 గంటలకు ఈ సమస్య తలెత్తిందని, ఆ వెంటనే సమస్యన పరిష్కరించామని, సదరు సంస్థ ప్రకటించింది. దీంతో ఇనస్టాగ్రామ్ హ్యాకింగ్ వదంతులకు చెక్ పడింది. మెటాకు చెందిన ఫేస్ బుక్ నుంచి గతంలో వినియోగదారుల సమాచారం భారీగా లీక్ అయింది. దీంతో ఇనస్టాగ్రామ్ పై పుకార్లు వచ్చాయి.