సీఎం ముందే.. త‌న‌ రిటైర్మెంట్‌ పై పేర్ని నాని సంచలన ప్రకటన!

మచిలీపట్నం సభలో మాజీ మంత్రి పేర్నినాని త‌న రాజ‌కీయ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దాదాపు రూ.5,156 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బందర్‌ పోర్ట్‌ పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు…

మచిలీపట్నం సభలో మాజీ మంత్రి పేర్నినాని త‌న రాజ‌కీయ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దాదాపు రూ.5,156 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బందర్‌ పోర్ట్‌ పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఇకపై సీఎం జగన్‌తో కలిసి సభలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని అందుకే ఇంత సేపు మాట్లాడుతున్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు.

పేర్ని నాని మాట్లాడుతూ… పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నార‌ని.. వయసులో చిన్నవాడు అయిపోయారు లేదంటే పాదాభివందనం చేసి ఉండేవాడిని అని… త‌ను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ కు చేతులు ఎత్తి దండం పెడుతున్నానని.. సీఎం జ‌గ‌న్ ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటార‌ని.. ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారని ప్ర‌శంస‌లు కురిపించారు.

కాగా వ‌చ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన వారసుడుని పోటీకి దింపుతానని ఇప్పటికే పేర్ని నాని పలుమార్లు క్లారిటీ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ మాత్రం ఈసారి ప్ర‌యోగాల జోలికి వెళ్ల‌కుండా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌ల‌ని అలోచ‌న‌తో ఉన్నట్లు చెప్పారు. అయినా స‌రే మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని వారసుడు కృష్ణమూర్తి(కిట్టు)నే ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. పేర్ని నానికి బదులుగా బందరులోని గడపగడపకు కిట్టు తిరుగుతున్నారు.