మిక్స్ డ్ టాక్ నుంచి హిట్ దిశగా..!

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు-2 సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ బిచ్చగాడు బ్రాండ్ పనిచేసింది. సినిమా మెల్లగా పుంజుకుంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు…

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు-2 సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ బిచ్చగాడు బ్రాండ్ పనిచేసింది. సినిమా మెల్లగా పుంజుకుంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ… ఆదివారం మళ్లీ పుంజుకుంది. అలా మొదటి వారాంతం పూర్తయ్యేసరికి తెలుగులో బిచ్చగాడు-2 సినిమా 80శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది.

మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బయ్యర్లకు లాభాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో వరుసగా ఫ్లాప్స్ ఇచ్చిన విజయ్ ఆంటోనీ, ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయినట్టయింది. ఇదే ఊపులో బిచ్చగాడు-3 కూడా ప్రకటించాడు విజయ్ ఆంటోనీ.

బిచ్చగాడు-2కు అన్నీ తానై వ్యవహరించాడు విజయ్ ఆంటోనీ. హీరోగా నటించడంతో పాటు.. ఈ కథ రాసుకున్నది కూడా అతడే. సంగీతం, ఎడిటింగ్, డైరక్షన్ కూడా అతడిదే. వీటితో పాటు విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై తనే సొంతంగా ఈ సినిమాను నిర్మించాడు కూడా.

ఇంత రిస్క్ చేసి సినిమా తీశాడు కాబట్టే, పెద్దగా ఆశపడకుండా… తనకు తెలిసిన బయ్యర్ కు రీజనబుల్ రేటుకే ఈ సినిమాను అమ్మేశాడు. ఇప్పుడు అందరూ లాభాలు చూడబోతున్నారు. విడుదలకు ముందు బడ్జెట్ కారణాల వల్ల సంప్రదాయ పద్ధతిలో ప్రచారం చేసిన విజయ్ ఆంటోనీ, సినిమాకు హిట్ టాక్ రావడంతో, ఇప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. ఎక్స్ ట్రా బడ్జెట్ పెట్టి, తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు సాగిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు గత వారాంతం వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఓపెన్ మైండ్ తో వచ్చి సినిమా చూడాల్సిందిగా మేకర్స్ చేసిన విజ్ఞప్తి, ఆదివారం కూడా పనిచేయలేదు.