బ్రేకింగ్..విజ‌య్ దేవరతో సమంత

డివోర్స్ అయిపోయిన తరువాత హీరోయిన్ సమంత ఫుల్ స్పీడ్ లో వుంది. అటు శాకుంతలం..ఇటు యశోద లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మంచి ఆఫర్ల కోసం చూస్తోంది.  Advertisement ఇప్పుడు అలాంటి ఆఫర్…

డివోర్స్ అయిపోయిన తరువాత హీరోయిన్ సమంత ఫుల్ స్పీడ్ లో వుంది. అటు శాకుంతలం..ఇటు యశోద లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మంచి ఆఫర్ల కోసం చూస్తోంది. 

ఇప్పుడు అలాంటి ఆఫర్ తలుపు తట్టింది. హీరో విజ‌య్ దేవర కొండ సరసన హీరోయిన్ గా చేయబోతోంది.

శివనిర్వాణతో హీరో విజ‌య్ సినిమా ముందు వెనుకలు ఆడుతూ వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పూరితో ప్లాన్ చేసిన జ‌నగనమణ సినిమా కు లోకషన్ల వేట ఆలస్యం అవుతోంది. అందుకని ఈ లోగా ఓ సినిమా చేసేయాలని విజ‌య్ డిసైడ్ అయ్యాడు. కియారా అద్వానీ మరో ఒకరిద్దరు హీరోయిన్ల దగ్గరకు వెళ్లిన కథ ఇప్పుడు సమంత దగ్గర సెటిల్ అయ్యింది.

అతి త్వరలో షూటింగ్ ప్రారంభించి ఫినిష్ చేసి, ఆపైన జ‌ఙనగనమణ సినిమా స్టార్ట్ చేస్తారు. సమంతతో చేయబోయే సినిమా పూర్తి ప్రేమ కథ.