పవన్..20 రోఙులు..50 కోట్లు..లాభంలో వాటా

ఇమేఙ్ అంటే అలా వుండాలి. క్రేఙ్ అంటే అలా వుండాలి. ఙనసేన అధిపతి పవన్ కళ్యాణ్ క్రేఙ్ అలా వుంది మరి. Advertisement భీమ్లా నాయక్ సినిమా ఫుల్ రన్ లో ఆంధ్రలో 30…

ఇమేఙ్ అంటే అలా వుండాలి. క్రేఙ్ అంటే అలా వుండాలి. ఙనసేన అధిపతి పవన్ కళ్యాణ్ క్రేఙ్ అలా వుంది మరి.

భీమ్లా నాయక్ సినిమా ఫుల్ రన్ లో ఆంధ్రలో 30 కోట్లు, సీడెడ్ లో 15 కోట్లు కలెక్ట్ చేయడానికే కిందా మీదా అవుతోంది. నైఙాం లో 36 కోట్లు వస్తే గట్టెక్కినట్లు. భీమ్లా సినిమాకు పవన్ రెమ్యూనిరేషన్ 50 కోట్లు అని టాక్ వుంది.

కానీ ఇప్పుడు ఒప్పుకున్న పీపుల్స్ మీడియా రీమేక్ సినిమాకు పవన్ రెమ్యూనిరేషన్ 50 కోట్లు ప్లస్ లాభాల్లో సగం వాటా అని తెలుస్తోంది. ఏ దైర్యంతో నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా ఈ డీల్ చేసిందో వారికే తెలియాలి.

పవన్ కు యాభై కోట్లు ఇచ్చి, కథ, మాటలు అందించే త్రివిక్రమ్ కు 10 కోట్లు ఇచ్చి, మరో హీరో సాయి ధరమ్ తేఙ్ కు 8 కోట్లు ఇస్తే…అక్కడికే 68 కోట్లు అయిపోతుంది.

ఇక మిగిలిన స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ కలిపి మరో పది కోట్లు అవుతుంది. అంటే 78 కోట్లు రెమ్యూనిరేషన్లు. ఆపై ప్రొడక్షన్, పబ్లిసిటీ . అది ఎంత అవుతుంది.

సినిమాలో భాగస్వామి అయిన ఙీ టీవీ వాటా, పవన్ వాటా పోను ఇక నిర్మాతకు మిగిలేదెంత? పైగా పవన్ కు అద్భుతమైన మార్కెట్ వుందేమో అనుకుంటే అన్నీ కలిపి 150 కోట్లు మార్కెట్ కష్టం అవుతోంది.

చూస్తుంటే నిర్మాతలంతా పోటీ పడి పవన్ కు ఆదాయం ముట్టచెబుతున్నట్లుంది.