విడాకుల కోసం వెయిటింగ్ – నరేష్

పవిత్రతో సహజీవనం సాగిస్తున్న సీనియర్ నటుడు నరేష్.. తమ బంధంపై మరింత క్లారిటీ ఇచ్చారు. చాలా లైఫ్ పోయిందని, కొంచెం లైఫ్ మాత్రమే మిగిలిందని, ఆ మిగిలిన జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని…

పవిత్రతో సహజీవనం సాగిస్తున్న సీనియర్ నటుడు నరేష్.. తమ బంధంపై మరింత క్లారిటీ ఇచ్చారు. చాలా లైఫ్ పోయిందని, కొంచెం లైఫ్ మాత్రమే మిగిలిందని, ఆ మిగిలిన జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాననే అర్థం వచ్చేలా రియాక్ట్ అయ్యారు.

“చాలా అనుభవాలయ్యాయి. చాలా లైఫ్ పోయింది, కొంత లైఫ్ మాత్రమే ఉంది. ఆ కొంత లైఫ్ లో నిస్వార్థంగా ఉండాలి, అండర్ స్టాండింగ్ ఉండాలి. ఇద్దరం సర్దుకుపోవాలి. ఎంతకాలం ఇలా సహజీవనంలో ఉంటామనేది చెప్పలేం. ఉన్నదే కొంతకాలం. ఈ కొంత కాలంలోనే మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. కలిసి జీవిస్తున్నాం.”

తామిద్దరం సహజీవనం చేస్తున్నామని చెప్పడానికి ఏమాత్రం భయపడడం లేదంటున్నారు నరేష్-పవిత్ర. తమ పాత భాగస్వాముల నుంచి విడాకుల కోసం వెయిటింగ్ అనే అర్థం వచ్చేలా స్పందించారిద్దరూ.

“మేం చెప్పడానికి భయపడడం లేదు. మేం సహజీవనం చేస్తున్నామని డిక్లేర్ చేశాం. మా ఇద్దరి పెళ్లిళ్లు రద్దయ్యాయి, తనకు ఆమె భర్త నుంచి, నాకు నా భార్య నుంచి ఎప్పటికైనా విడాకులు రావాల్సిందే. మేం కలిసుండడానికి చట్టం అనుమతిచ్చింది. ఉంగరం పెడితే లేదా తాళి కడితే పెళ్లయినట్టు కాదు, రెండు మనసులు కలిస్తే పెళ్లవుతుంది. అలా మా పెళ్లి అయిపోయింది. మేం కలిసి జీవిస్తున్నాం, ఇలానే ఉంటాం.”

తాజా ప్రకటనతో వీళ్లిద్దరి రిలేషన్ షిప్ పై జనాలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. తన భార్యతో విడాకులు వచ్చేంత వరకు పవిత్రతో సహజీవనం చేస్తారు నరేష్. విడాకులు వచ్చిన తర్వాత పవిత్రను పెళ్లి చేసుకుంటారు. అదీ సంగతి.